ఈ దెబ్బ గేమ్ ఛేంజర్‌ను మరిపించేలా ఉండాలి..
కానీ ఇప్పుడు ఇదే మొదటి ట్రేండింగ్ దెబ్బ గేమ్ ఛేంజర్‌ను మరిపించేలా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
By: Tupaki Desk | 23 March 2025 11:44 PM ISTరామ్ చరణ్ కెరీర్‌లో ‘గేమ్ ఛేంజర్’ ఒక పెద్ద ఎదురుదెబ్బగా నిలిచిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా, ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో ‘తరవాత సినిమా ఏంటీ? ఎలాంటి ప్రాజెక్ట్‌తో రీడీ అవుతున్నాడు?’ అనే కుతూహలంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ చేస్తున్న కొత్త చిత్రం ఫైనల్‌గా హోప్స్‌ను పెంచింది. ఇంకా టైటిల్ ఖరారు కాకపోయినా, ఫస్ట్ గ్లింప్స్ వచ్చేలోపే సినిమాపై అంచనాలు ఊపందుకున్నాయి.
కానీ ఇప్పుడు ఇదే మొదటి ట్రేండింగ్ దెబ్బ గేమ్ ఛేంజర్‌ను మరిపించేలా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసింది అంతా కాంబినేషన్ గురించే. చరణ్ బుచ్చిబాబు కాంబో కొత్తగా అనిపించడం, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడమూ అంచనాలకు బీజం వేశాయి. కానీ సినిమా కాన్సెప్ట్, కథను అభిమానులు అంచనా వేసేందుకు ఏ క్లారిటీ లేదు. స్పోర్ట్స్ డ్రామా అనేది ఓవర్‌వ్యూ మాత్రమే.
అసలు కథ ఎమోషన్ ఏంటో, కథానాయకుడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అన్నదానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అందుకే ఇప్పుడు గ్లింప్స్ కట్‌కి కీలక బాధ్యత వచ్చేసింది. అదే ఈ సినిమా హైప్‌ను ఫ్యూయల్ చేసే అసలైన మూమెంట్. పుట్టినరోజు స్పెషల్‌గా రిలీజ్ చేయబోయే గ్లింప్స్‌కి చిత్రబృందం సీరియస్‌గా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే “చరణ్ బర్త్‌డే ట్రీట్ మామూలుగా ఉండదు” అనే టాక్ మొదలైంది.
చూసినవారికి ఇది “నెక్ట్స్ లెవల్” అని ఫీల్ కలిగిందట. అంటే బుచ్చిబాబు చరణ్ కోసం ఒక విభిన్న వాతావరణాన్ని సెట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. లుక్, బాడీ లాంగ్వేజ్, విజువల్ టోన్ అన్నీ న్యూ స్టైల్‌లో ఉండేలా డిజైన్ చేశారట. ఇది వర్కౌట్ అయితే గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్‌ను కప్పేస్తుంది. ఇంకా ఈ సినిమా కథపై, క్యారెక్టర్ డెప్త్‌పై మినిమమ్ హింట్ గ్లింప్స్‌లో ఇవ్వగలిగితేనే, ఫస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది.
గతంలో ‘రంగస్థలం’తో చరణ్ ఒక ఎమోషనల్ మాస్ హీరోగా నిలిచారు. అదే ఫీలింగ్ మరోసారి వస్తుందా లేదా బుచ్చిబాబు కొత్తగా తీర్చిదిద్దిన పాత్రతో చరణ్ మరో లెవెల్ ను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారా? అన్నది ఈ గ్లింప్స్‌తో తేలిపోతుంది. క్రికెట్, విలేజ్, సమాజంలో మార్పు.. అన్నిటినీ మిక్స్ చేస్తే ఓ ఇంటెన్స్ కథ రావచ్చు అనే ఆశ అభిమానుల్లో ఉంది. చివరగా చెప్పుకోవాల్సింది ఒక్కటే. చరణ్‌కి ‘గేమ్ ఛేంజర్’ ఒక గుణపాఠంగా మిగిలింది. ఇప్పుడు బుచ్చిబాబుతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌నే రీడెంప్షన్ గా ఫ్యాన్స్ చూస్తున్నారు. అందుకే “మొదటి దెబ్బ గేమ్ ఛేంజర్‌ను మరిపించేలా ఉండాలి” అనే డిమాండ్ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.