RC16: ఇది నిజం కాదు!
రెహమాన్ లాంటి టాలెంటెడ్ కంపోజర్ మధ్యలో తప్పుకున్న సందర్భాలు గతంలో ఉన్నప్పటికీ, RC16 నుంచి మాత్రం ఆయన తప్పుకోవడం లేదని తెలుస్తోంది.
By: Tupaki Desk | 26 Jan 2025 4:36 AM GMTటాలీవుడ్‌లో అంచనాలను పెంచుకుంటూ ముందుకు సాగుతున్న రామ్ చరణ్ - బుచ్చిబాబు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ RC16పై ఇటీవల కొన్ని వార్తలు హల్‌చల్ చేశాయి. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన ఏఆర్ రెహమాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సోషల్ మీడియాలో రకరకాల గాసిప్‌లు వ్యాపించాయి. రెహమాన్ లాంటి ప్రతిభావంతుడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తే, సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థాయి తీసుకురావడం ఖాయం. అయితే ఆయన ప్రాజెక్ట్‌ను వదిలేశారన్న వార్తలు అభిమానుల్లో ఆందోళనను కలిగించాయి.
ఇదివరకే రెహమాన్ కొన్ని ట్యూన్స్ కూడా ఇచ్చారని, అయితే పలు కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం నిజమేనని గాసిప్‌లు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై మొన్నటి వరకు చిత్ర బృందం స్పందించకపోవడం కూడా ఆ అనుమానాలను మరింత పెంచింది. కొంతమంది అభిమానులు ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు.
ఫైనల్ గా ప్రాజెక్ట్‌పై అనేక అంచనాలు ఉన్న నేపథ్యంలో, మేకర్స్ తాజాగా స్పష్టత ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గారన్న వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారం అని తేల్చి చెప్పారు. రెహమాన్ ఇంకా ఈ ప్రాజెక్ట్‌కు అద్భుతమైన సంగీతాన్ని అందించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నారని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని చిత్ర యూనిట్ సన్నిహితులు ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
రెహమాన్ లాంటి టాలెంటెడ్ కంపోజర్ మధ్యలో తప్పుకున్న సందర్భాలు గతంలో ఉన్నప్పటికీ, RC16 నుంచి మాత్రం ఆయన తప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఆయన ఇచ్చిన మొదటి ట్యూన్స్‌కు చిత్ర బృందం ఫిదా అయ్యిందని సమాచారం. ఈ సినిమాతో రెహమాన్ తనకున్న అనుభవాన్ని పూర్తిగా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారని టీమ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాను రామ్ చరణ్ కెరీర్‌లో ఒక బిగ్ సినిమాగా మలచాలనే ప్రయత్నంలో దర్శకుడు, నిర్మాతలు ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ ను సరికొత్తగా చూపించనున్నట్లు తెలుస్తోంది. కామెడీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రానున్నట్లు సమాచారం.