రామ్ చరణ్ ఐదేళ్లు బిజీ బిజీ..!
ఐతే ఈ సినిమాను 2026 ఎండింగ్ లేదా 2027 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాకు చరణ్ రెండేళ్లు టైం ఇస్తున్నాడు.
By: Tupaki Desk | 6 Jan 2025 4:24 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఈ సంక్రాంతికి వస్తుంది. ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. RC16గా వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు ఏకంగా గ్లోబల్ స్టార్ తోనే సినిమా తీస్తున్నాడు. ఐతే ఈ సినిమా కాస్టింగ్ అండ్ టెక్నిషియన్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. మ్యూజిక్ కి రెహమాన్ ని తీసుకున్న బుచ్చి బాబు చరణ్ సరసన జాన్వి కపూర్ ని ఫిక్స్ చేశాడు
ఐతే ఈ సినిమాను 2026 ఎండింగ్ లేదా 2027 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాకు చరణ్ రెండేళ్లు టైం ఇస్తున్నాడు. ఇక మరోపక్క రామ్ చరణ్ తన 17వ సినిమా సుకుమార్ డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. చరణ్ సుకుమార్ ఈ కాంబో అంటే మెగా ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. రంగస్థలం సినిమా ఈ ఇద్దరికి బ్లాక్ బస్టర్ అందించింది. సుకుమార్ సినిమాల స్థాయిని పెంచిన సినిమా రంగస్థలం. అప్పటివరకు చాలా క్లాస్ సినిమాలు చేసిన సుక్కు తనలో ఉన్న మాస్ ని చూపించిన సినిమా అది. అందుకే సుకుమార్ తన కెరీర్ లో రంగస్థలం చాలా స్పెషల్ అని చెబుతుంటాడు.
ఇక బుచ్చి బాబు సినిమా పూర్తి కాగానే సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా కు చరణ్ మరో రెండు మూడేళ్లు అంటే దాదాపు రాబోయే రెండు సినిమాల కోసం రామ్ చరణ్ తన ఐదేళ్ల డేట్స్ లాక్ చేస్తున్నాడు. బుచ్చి బాబు సినిమా ఒక పార్ట్ గానే వచ్చే ఛాన్స్ ఉండగా సుకుమార్ సినిమా మాత్రం రెండు భాగాలుగ తీసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సుకుమార్ రామ్ చరణ్ ఈ కాంబో స్పెషల్ ఏంటన్నది మరోసారి చూపించేలా ఆర్సీ 17వ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
తప్పకుండా చరణ్ ఈ సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపిస్తాడని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కి మెగా మాస్ ట్రీట్ ఇచ్చేలా చరణ్ కష్టపడుతున్నాడు. మరి రాబోయే సినిమాలు చరణ్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయన్నది చూడాలి.