మెగా పవర్ స్టార్ డెబ్యూకి 17 ఏళ్లు!
హీరో క్యారెక్టరైజేషన్ మీద స్టోరీలు రాయడం పూరి స్పెషాల్టీ.
By: Tupaki Desk | 28 Sep 2024 8:44 AM GMTరామ్ చరణ్ `చిరుత `చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చరణ్ లాంచ్ అయ్యాడు. ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఆ ఛాన్స్ ఏ దర్శకుడికి ఇస్తే బాగుంటుందని చిరు ఎన్నో విషయాలు ఆలోచించి చివరిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అయితే బాగుంటుందని ఆయన చేతుల్లో పెట్టారు. పూరి కూడా చిరు నమ్మకాన్ని అంతే నిలబెట్టారు. చరణ్ కి డెబ్యూతోనూ పూరి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.
తనని తొలి సినిమాతోనే పెద్ద స్టార్ని చేసాడు. హీరో క్యారెక్టరైజేషన్ మీద స్టోరీలు రాయడం పూరి స్పెషాల్టీ. పూరిలో ఈ ట్యాలెంట్ చూసే చిరు అతనికి అప్పజెప్పారు. కథ సాధారణంగా ప్రారంభమైన లొతుకు వెళ్లేకొద్ది చిరుతో హీరో పాత్రని ఆవిష్కరించిన తీరు అద్బుతం. అటు మణిశర్మ సంగీతం సినిమాని నెక్స్ట్ లెవల్లో నిలబెట్టింది. సినిమా రిలీజ్ కి ముందు మ్యూజికల్ గా మంచి విజయం సాధించింది.
తాజాగా ఈ సినిమా విడుదలై నేటికి 17 ఏళ్లు పూర్తయింది. 17 ఏళ్ల క్రితం ఇదే రోజున (2007, సెప్టెంబర్ 28న) విడుదలైంది. దీన్ని గుర్తుచేస్తూ నిర్మాణ సంస్థ వైజయంతీ ఫిల్మ్స్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేసింది. ఇప్పుడీ ట్వీట్‌ను చరణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. `17 ఏళ్ల క్రితం ఇదే రోజున గ్లోబల్ స్టార్ ఎదుగు దలను ప్రపంచం చూసింది. రామ్‌చరణ్ హీరోగా వచ్చిన తొలిచిత్రం చిరుత బాక్సాఫీస్ వద్ద తుఫానులా తీసుకు వెళ్లింది.
చెర్రీ అద్భుతమైన సినిమా ప్రయాణానికి వేదికగా నిలిచింది` అంటూ ట్వీట్ చేసింది. మెగా అభిమానుల్లో చరణ్ క్రేజ్... చిరుతలో అతడి పెర్పార్మెన్స్ చూసి రాజమౌళి రెండవ ప్రయత్నంగా `మగధీర` చేసారు. రెండవ సినిమాతో ఏకంగా చరణ్ ని 100 కోట్ల క్లబ్ లో చేర్చాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ జర్నీ ఎలా సాగుతుందో తెలిసిందే.