Begin typing your search above and press return to search.

క్రికెట్ లో సచిన్.. ఇండియన్ సినిమాకు శంకర్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.

By:  Tupaki Desk   |   29 Dec 2024 10:22 AM GMT
క్రికెట్ లో సచిన్.. ఇండియన్ సినిమాకు శంకర్..!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డల్లాస్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో భాగంగా రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్పీచ్ మెగా ఫ్యాన్స్ ని ఉత్సాహపరచింది. మైక్ అందుకున్న రామ్ చరణ్ ఈ హంగామా చూస్తే అమెరికాకు వచ్చినట్టు లేదు ఇండియాలోనే ఉన్నట్టు ఉందని అన్నారు. అందుకే డల్లాసపురం అని ఊరికే అనరేమో అని అన్నారు.

ఇక్కడకు వచ్చిన సినిమా అభిమానులకు థాంక్స్ అన్నారు చరణ్. తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అని.. శంకర్ గారి పక్కన ఆయన సినిమాలో నటించానా అని అనుకుంటున్నా అని అన్నారు. ఎన్నోసార్లు శంకర్ గారిని కలిసినప్పుడు తెలుగులో సినిమా చేయడని చెబుదామనుకున్నా కానీ ఎప్పుడు చెప్పలేదు. నాతో కాదు ఎవరితో అయినా చేయండని చెప్పాలని అనిపించిందని అన్నారు చరణ్.

ఆయనతో ఈ 3 ఏళ్ల జర్నీలో ప్రతిరోజు షూటింగ్ కి వెళ్లేప్పుడు న్యూ బిగినింగ్ లా అనిపించేదని అన్నారు. క్రికెట్ లో సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ సార్ అలా అని అన్నారు. ఆయనలా సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్ ఎవరు లేరని అన్నారు. నంబర్ 1 కమర్షియల్ డైరెక్టర్.. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా శంకర్ గారని అన్నారు చరణ్.

అలాంటి శంకర్ గారితో కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చినందుకు పేరెంట్స్ కి, గాడ్ కి థాంక్స్ అని అన్నారు. ఇక RRR సినిమా బ్రదర్ ఎన్టీఆర్ తో చేశా సోలో సినిమా వచ్చి ఐదేళ్లు అవుతుందని ఈ సినిమా తప్పకుండా అలరిస్తుందని అన్నారు. ఏం సాధించాలన్నా సహనం ఉండాలి. తన దర్శకుల దగ్గర నుంచి ఇదే నేర్చుకున్నా అని అన్నారు రాం చరణ్.

దిల్ రాజు గురించి చెబుతూ ఆయనతో పనిచేయడం ఎప్పుడూ బాగుంటుంది. మా ఇండస్ట్రీకి రెస్పాన్సిబుల్ వ్యక్తిగా ఉన్నారని అన్నాడు చరణ్. దిల్ రాజు, థమన్ స్పీచ్ లలో ఈసారి థమన్ మార్కులు కొట్టేశాడని సరదాగా చరణ్ చెప్పారు.

ఇక ఫ్యాన్స్ కోరిక మేరకు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇది ఒక మెమొరబుల్ వీడియోగా తాను ఇండియాకు తీసుకెళ్తా అని అన్నారు. యూఎస్ మార్కెట్ నైజా, ఆంధ్ర రెవిన్యూ లాగా వస్తుందని ఇక్కడ ట్రూ సినిమా లవర్స్ ఉన్నారని అన్నారు. దేశం కానీ దేశంలో మీరు మాపై ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. శంకర్ గారి సినిమాల్లో ఉండే బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఈ సినిమాలొ ఉంటుంది. సినిమా అవుట్ అడ్ అవుట్ ఎంజాయ్ చేస్తారని చరణ్ అన్నారు.

ఇంతలో ఓజీ గురించి ఫ్యాన్స్ కేకలు వేస్తుండగా తాను కూడా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా అని అన్నారు. బాబాయ్ వస్తా అంటే తన సినిమా ఆపేవాడినని అన్నారు. సంక్రాంతికి విశ్వంభర రావాల్సి ఉన్నా ఈ సినిమా కోసం అది వాయిదా వేశారని ఆ సినిమా యూనిట్ కు థాంక్స్ అని అన్నారు చరణ్. ఈ సంక్రాంతి అన్ ప్రెడిక్టబుల్ అంటూ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తూ తన స్పీచ్ ముగించారు చరణ్.