చరణ్- ధనుష్ కాంబో.. మాస్ ర్యాంపేజేనా!
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కుబేర, కూలీ సహా అనేక సినిమాల్లో వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన నటులు యాక్ట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 29 March 2025 3:40 PMపాన్ ఇండియా ట్రెండ్ లో కొత్త కొత్త కాంబోలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని భాషల హీరోలు.. వేరే లాంగ్వేజెస్ లో తెరకెక్కుతున్న సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కుబేర, కూలీ సహా అనేక సినిమాల్లో వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన నటులు యాక్ట్ చేస్తున్నారు. త్వరలోనే థియేటర్లలో తమ చిత్రాలతో సందడి చేయనున్నారు.
అయితే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి వర్క్ చేయనున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. చరణ్ హీరోగా ధనుష్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ లైన్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. రీసెంట్ గా రామ్ చరణ్ కు ధనుష్.. మాస్ సబ్జెక్ట్ తో ఉన్న స్టోరీ లైన్ ను నెరేట్ చేశారట.
ఆ లైన్.. చరణ్ కు బాగా నచ్చేసిందని.. వెంటనే ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు బుచ్చి బాబు సానాతో పెద్ది మూవీకి గాను వర్క్ చేస్తున్న రామ్ చరణ్.. ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఆ సినిమా తర్వాత జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తో చరణ్ మరో సినిమాను ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆ మూవీ అనౌన్స్మెంట్ రాగా.. త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. ఆ సినిమా తర్వాత చరణ్- ధనుష్ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అయితే ఎమోషన్ అండ్ ఇంటెన్సిటీ విషయంలో చాలా లోతుగా వెళ్ళేటట్లు ఉండే ధనుష్ స్టోరీ టెల్లింగ్.. మూవీ మేకింగ్.. ఎల్లప్పుడూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు.
అయితే ధనుష్ ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు సింగర్ గా, లిరిసిస్ట్ గా, నిర్మాత గా, డైరెక్టర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన డైరెక్ట్ చేసిన ప పాండి, రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రాలు.. తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇడ్లీ కడై మూవీని ధనుష్ డైరెక్ట్ చేస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో ఆ మూవీ రిలీజ్ కానుండగా.. రామ్ చరణ్ తో సినిమా చేస్తారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలు రావడమే లేటు.. ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారెంటీ, మాస్ ర్యాంపేజీ అని అంతా చెబుతున్నారు. మరి చరణ్, ధనుష్ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలా ఉంటుందో వేచి చూడాలి.