RRR చరణ్ ఇంట్రో సీన్.. అంత కష్టపడ్డారా?
అయితే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ గుర్తుందా? సినిమాలోని హైలెట్ సీన్స్ లో అదొకటి. స్వాతంత్ర్యం కోసం పోరాడే చాలా మంది.. పోలీస్ స్టేషన్ పైకి దండయాత్రలా వస్తుంటారు.
By: Tupaki Desk | 27 Dec 2024 10:22 AM GMTదర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆ చిత్రంతో వేరే లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇక జక్కన్న అయితే సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు.
అయితే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ గుర్తుందా? సినిమాలోని హైలెట్ సీన్స్ లో అదొకటి. స్వాతంత్ర్యం కోసం పోరాడే చాలా మంది.. పోలీస్ స్టేషన్ పైకి దండయాత్రలా వస్తుంటారు. ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. అక్కడే ఉన్న రామ్ చరణ్.. ఎంతో ధైర్యంగా ఆ సన్నివేశాన్ని ఎదుర్కొంటాడు.
రామ్ చరణ్ ను చూసి అంతా వెనక్కి వెళ్తారు. అదంతా చరణ్ ఓ కన్ను లోపల నుంచి మనం చూశాం. చెప్పాలంటే ఆ సమయంలో అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఏదేమైనా చరణ్ ఎంట్రీ సీన్.. ఎప్పటికీ ఎవర్ గ్రీన్. చరణ్ ఫ్యాన్సే కాకుండా.. మిగతా హీరోల అభిమానులు.. ఆ సన్నివేశాన్ని కచ్చితంగా మెచ్చుకుని తీరుతారు!.
అయితే ఇప్పుడు ఆ సీన్ కోసం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చరణ్ ఇంట్రో సీన్ గురించి జక్కన్న మాట్లాడారు. కళ్లలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజలను చూపించిన సీన్.. రియల్ గా షూట్ చేశామని తెలిపారు.
చరణ్ కన్ను దగ్గరకు పూర్తిగా కెమెరా పెట్టి తీశామని చెప్పారు. ఆ తర్వాత ఆ సీన్ గురించి పలు విషయాలను పంచుకున్నారు. షూటింగ్ విజువల్స్ ను కూడా చూపించారు. దీంతో అంతా షాకైపోతున్నారు. చరణ్ ఇంట్రో సీన్ కోసం వేరే లెవెల్ లో రాజమౌళి అండ్ టీమ్ కష్టపడినట్లు క్లియర్ గా తెలుస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
ఏ ఇతర టీమ్ అయినా రెండు రోజుల తర్వాత ఆ సీన్ షూట్ ను నిలిపివేసి ఉండవచ్చని అంటున్నారు. కానీ అలాంటి ఫీట్ ను తీయడానికి నిజమైన దమ్ము కావాలని అభిప్రాయపడుతున్నారు. ఆ విషయంలో జక్కన్న తోప్ అని.. డాక్యుమెంటరీ వచ్చాక ఆ సీన్ వెనుక కష్టమంతా తెలుస్తోందని అంటున్నారు. అయితే అంత కష్టపడ్డారు కాబట్టే.. అంతకు మించి ప్రతిఫలం అందుకున్నారని చెప్పడంతో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.