సంక్రాంతి సందడి.. మహేష్ రికార్డును చరణ్ బ్రేక్ చేస్తాడా?
అయితే పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న గేమ్ ఛేంజర్ ఓపెనింగ్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 5 Jan 2025 5:30 PM GMT'సినీ' సంక్రాంతి సందడి.. జనవరి 10వ తేదీ నుంచి మొదలవ్వనున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో పొంగల్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవ్వనున్నాయి. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ నిర్మాత దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు.
ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, నాజర్ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించిన గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, టాలీవుడ్ అందం అంజలి.. ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ తో పాటు సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ అందుకోగా.. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ వేరే లెవెల్ లో అలరిస్తోంది. సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. శంకర్ మూవీ అంటే ఆడియన్స్ ఏం కోరుకుంటారో.. ఆ ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది.
అయితే పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న గేమ్ ఛేంజర్ ఓపెనింగ్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. దాదాపు రూ.42- రూ.47 కోట్ల వసూళ్లను తొలిరోజు సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రూ.50 కోట్ల మార్క్ ను కూడా టచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డును చరణ్ బ్రేక్ చేయనున్నారని అంచనా వేస్తున్నారు సినీ పండితులు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సంక్రాంతి ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ ఉంది. 2020 పొంగల్ బరిలో దిగిన ఆ సినిమా.. రూ.45.7 కోట్ల ఓపెనింగ్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది.
ఇప్పుడు మహేష్ మూవీ రికార్డును గేమ్ ఛేంజర్ కచ్చితంగా బద్దలకొటనున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే సినిమాకు తిరుగులేదని చెప్పాలి. మొత్తానికి అటు ఇండియన్-2తో నిరాశపరిచిన శంకర్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో హిట్ కొడతారని.. ఇటు చరణ్ రాజమౌళి మిథ్ ను చరణ్ బ్రేక్ చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.