గేమ్ ఛేంజర్ కోసం ఫ్యాన్ సూసైడ్ లెటర్.. మరీ ఇంత పిచ్చి అవసరమా?
కచ్చితంగా మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లాగే.. రాజమౌళి సెంటిమెంట్ మిథ్ ను బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు.
By: Tupaki Desk | 28 Dec 2024 5:38 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 10వ తేదీన వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో థియేటర్లలో సందడి చేయనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ కావడంతో ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కచ్చితంగా మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లాగే.. రాజమౌళి సెంటిమెంట్ మిథ్ ను బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మేకర్స్ సినిమా నుంచి సాంగ్స్ అండ్ టీజర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్ కు మరో 13 రోజులే ఉన్నా ట్రైలర్ ను విడుదల చేయలేదు.
దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంకెప్పుడూ ట్రైలర్ రిలీజ్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఇంత లేట్ అని మేకర్స్ ను నిలదీస్తున్నారు. ఇప్పుడు ఓ ఫ్యాన్ ఏకంగా గేమ్ ఛేంజర్ మేకర్స్ కు సూసైడ్ బెదిరింపుల లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డిసెంబర్ చివరి కల్లా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోయినా, న్యూ ఇయర్ రోజు ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అభిమానుల ఎమోషన్స్ ను పట్టించుకోవట్లేదని ఆరోపించాడు.
"గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ కు ఈశ్వర్ చరణ్ అన్న ఫ్యాన్ చింతిస్తూ రాయునది ఏమనగా.. సినిమాకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్ ఇవ్వట్లేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్ ను పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరు కల్లా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇట్లు.. మీ విధేయుడు చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్" అంటూ రాసి ఉన్న లెటర్ వైరల్ గా మారింది.
ట్రైలర్ విడుదల కోసం ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిన లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం ఆందోళన కలిగించే విషయమే. బ్లాక్ మెయిల్ చేయడం ఎప్పటికీ కరెక్ట్ కాదనే చెప్పాలి. దీంతో ఇలాంటి పనులు చేసేటప్పుడు కాస్త ఆలోచించండని నెటిజన్లు కోరుతున్నారు. అభిమానం అనేది హద్దులు దాటడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి చర్యలకు హీరోలు కూడా ఎప్పటికి ఒప్పుకోరు. కాబట్టి ఫ్యాన్స్ అదుపులో ఉంటే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక థియేట్రికల్ రిలీజ్ కు ఐదు రోజుల ముందు గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.