రామ్ చరణ్ న్యూ ప్లాన్స్.. నెక్ట్స్ ఎవరు?
అయితే, రామ్ చరణ్ మాత్రం వరుసగా సినిమాలు చేయాలని, ఎప్పటిలానే చాలా గ్యాప్ తీసుకోవద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 16 Feb 2025 6:07 AM GMTరామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానాతో తన 16వ సినిమాను పూర్తి చేయడంపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో, పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2025 మొత్తం కూడా చరణ్ ఈ సినిమాతోనే బిజీ కానున్నాడు. అందుకే ఈ ఏడాది చివర్లో మరో కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం తక్కువ. అయితే, రామ్ చరణ్ మాత్రం వరుసగా సినిమాలు చేయాలని, ఎప్పటిలానే చాలా గ్యాప్ తీసుకోవద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలు దర్శకులతో చర్చలు జరిపినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ భట్‌తో చరణ్ సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ లేదు. అదే విధంగా, 'హాయ్ నాన్న' డైరెక్టర్ శౌర్యవ్‌తో చరణ్ సినిమా ఓకే చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా, ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. కథ వినిపించినప్పటికీ, అది చరణ్‌ను రిస్క్ చేసేంత ఆసక్తికరంగా లేదని తెలుస్తోంది.
రామ్ చరణ్‌కు వచ్చిన కథలలో కొన్నింటిపై బాగా ఇంట్రెస్ట్ ఉన్నా, ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్ట్‌కీ ఫైనల్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. ప్రస్తుతం ఆయనకు 'సుకుమార్'తో సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. రంగస్థలం తర్వాత వీరి కాంబోలో మరో పవర్‌ఫుల్ కథ రాబోతుంది. అయితే, ఈ ప్రాజెక్ట్ ‘RC16’ పూర్తయ్యాకే మొదలవుతుంది. దీనికంటే ముందుగా ఇంకో ప్రాజెక్ట్ సెట్లోకి వెళ్లే ఛాన్స్ ఉందా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇప్పటివరకు బుచ్చిబాబు సినిమా షూటింగ్ మీదే చరణ్ ఎక్కువ ఫోకస్ పెట్టినప్పటికీ, కొత్తగా వినిపిస్తున్న కథలపై ఆసక్తిని చూపుతున్నాడు. ప్రస్తుతం ఆయన కోరుకుంటున్నది ఒక యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ అని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన ఇటీవల బోయపాటి శ్రీను, లైగర్ దర్శకుడు పూరి జగన్నాథ్ వంటి మాస్ దర్శకులతోనూ భేటీ అయినట్లు టాక్. కానీ, వీరితో సినిమా సెట్లోకి వెళ్లే అవకాశం తక్కువ.
ఇక మరో ఆసక్తికరమైన విశయం ఏమిటంటే, రామ్ చరణ్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌తోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సిద్దార్థ్ ఆనంద్, శ్రీరామ్ రాఘవన్, నిఖిల్ భట్ వంటి డైరెక్టర్లు ఇప్పటికే చరణ్‌ను కలిసినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ఇంతవరకు ఎవరి ప్రాజెక్ట్‌నీ ఫైనల్ చేయలేదన్నది తాజా సమాచారం. మొత్తానికి, రామ్ చరణ్ ముందుగా RC16, ఆ తర్వాత RC17 (సుకుమార్ ప్రాజెక్ట్) కోసం రెడీ అయ్యారు. వీటితో పాటు, ఇంకో పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. అయితే అది ఎవరితో? ఎలాంటి కథతో? అనే విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.