మెగా పవర్ స్టార్ బాల్యం..చదువు అలా!
కేవలం చిరంజీవి కుమారుడినైంత మాత్రాన స్టార్ అవ్వను? అన్న విషయాన్నిచరణ్ వేగంగానే గమనించి ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగాడు.
By: Tupaki Desk | 28 March 2025 1:30 PMమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎదిగిన వైనం గురించి చెప్పా ల్సిన పనిలేదు. తండ్రిని మించిన తనయుడిగా ఎదుగుతున్నాడు. నటుడిగా గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కేవలం చిరంజీవి కుమారుడినైంత మాత్రాన స్టార్ అవ్వను? అన్న విషయాన్నిచరణ్ వేగంగానే గమనించి ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగాడు.
వారసత్వం అన్నది కేవలం ఎంట్రీ వరకే పరిమితం చేసి అటుపై తనకు తానుగానే ఎదిగాడు. అందుకే తనయుడి విషయంలో చిరంజీవి సంపూర్ణంగా ఉంటారు. తన జీవితంలో ఎవర్ని సంపాదించారంటే రామ్ చరణ్ ని సంపాదించానని ఎంతో గర్వంగా చెబుతారాయన. బాబాయ్ పవన్ కళ్యాణ్ కి కూడా చరణ్ అంటే ఎంతో ఇష్టం. తనని ఓ కొడుకులా కాకుండా తమ్ముడిలా ట్రీట్ చేస్తుంటారు. బాబాయ్ అంటే చరణ్ అంతే ప్రేమిస్తాడు.
వ్యక్తిగతంగా చరణ్ పై బాబాయ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పవన్ స్వాగ్ అంటే చరణ్ కి ఎంతో ఇష్టం. మరి అలాంటి చరణ్ బాల్యం...చదువులు ఎలా సాగాయో తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదూ.
రామ్ చరణ్ చెన్నైలో జన్మించాడు. చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్ లో చదువుకు శ్రీకారం చుట్టాడు. అటుపై హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసాడు. సెయింట్ మేరీస్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నాడు. అయితే చరణ్ చదువుల్లో మరీ అంత యాక్టివ్ గా కాదు. రానా, శర్వానంద్ అంతా ఒకే బ్యాచ్ కావడంతో? వాళ్లెవ్వరికీ చదువులు సరిగ్గా అబ్బలేదని రానా చాలా సందర్భాల్లో తెలిపారు. స్కూల్ , కాలేజీలకు బంక్ కొట్టిన సందర్భాలు కోకొల్లలు అంటూ చెప్పిన సందర్భాలెన్నో.
చరణ్ సినిమా వాతావరణంలో ఉన్నా? చిరంజీవి ఆ ప్రభావం పెద్దగా పడకుండానే చూసుకున్నారు. అయినా తనలో ఫ్యాషన్ గుర్తించి అప్పు డప్పుడు ఇంట్లోనే డాన్సులు వేయించేవారు. అలా చరణ్ డాన్సు గురువుగా చిరంజీవి చిన్నప్పుడే అయ్యారు. అటుపై ముంబై కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాడు చరణ్. 2007 లో `చిరుత` సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు.