Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. గుడ్ న్యూస్ ఏమిటంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ ప్రమోషన్స్ ని ఫైనల్ గా షురూ చేశారు.

By:  Tupaki Desk   |   30 Sep 2024 4:04 AM GMT
గేమ్ ఛేంజర్.. గుడ్ న్యూస్ ఏమిటంటే..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ ప్రమోషన్స్ ని ఫైనల్ గా షురూ చేశారు. ఇన్ని రోజులు సినిమాపై పెద్దగా బజ్ లేదు. అయితే నెక్స్ట్ మూడు నెలల్లో మూవీకి కావాల్సినంత హైప్ ని తీసుకొని రావడానికి చిత్ర యూనిట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తోందని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ సెకండ్ సింగిల్ కి సంబందించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. సెప్టెంబర్ 30న ఈ సాంగ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. రా మచ్చ మచ్చ అంటూ సాగే ఈ మాస్ బీట్ కచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ దిల్ రాజుని ఇంటర్వ్యూ చేశారు. క్రిస్మస్ కి ‘గేమ్ చేంజర్’ మూవీ రిలీజ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చా సర్ అని అనంత శ్రీరామ్ దిల్ రాజుని అడిగారు. ఆల్ మోస్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న మూవీ రిలీజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.. దానికి తగ్గట్లుగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ లో గేమ్ చేంజర్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నాం. అలాగే అక్టోబర్ 2న థర్డ్ సింగిల్ రిలీజ్ అవ్వబోతోందని దిల్ రాజు స్పష్టం చేశారు.

ఈ మూడు నెలలు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేయబోతున్నాం. ఇకపై ప్రతి నెల సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ‘గేమ్ చేంజర్’ లో ఉంటాయని దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. దిల్ రాజు మాటలను బట్టి చూస్తుంటే ఈ మూడు నెలల కాలంలో ‘గేమ్ చేంజర్’ కి వీలైనంత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని అర్ధమవుతోంది. అక్టోబర్ లో టీజర్ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. ఈ టీజర్ తో ‘గేమ్ చేంజర్’ సినిమాపై పబ్లిక్ కి ఒక అభిప్రాయం వస్తుంది.

‘భారతీయుడు 2’ లాంటి డిజాస్టర్ తర్వాత శంకర్ నుంచి ‘గేమ్ చేంజర్’ మూవీ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ఫెయిల్యూర్ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. అయితే శంకర్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారంట. ‘ఇండియన్ 2’ మూవీ విషయంలో జరిగిన పొరపాట్లు ‘గేమ్ చేంజర్’ లో రిపీట్ కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు టాక్. ‘ఇండియన్ 3’ మూవీ షూటింగ్ కంప్లీట్ గా పక్కన పెట్టి ‘గేమ్ చేంజర్’ పైన శంకర్ వర్క్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో కచ్చితంగా మార్కెట్ లోకి బలంగా వెళ్తుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో మార్క్ క్రియేట్ చేసుకోవడానికి దిల్ రాజుకి ‘గేమ్ చేంజర్’ రూపంలో మంచి ఛాన్స్ దొరికింది. మూవీని ఎంత స్ట్రాంగ్ గా ప్రమోట్ చేసి పబ్లిక్ లోకి పంపిస్తే అంత ఎక్కువ మార్కెట్ క్రియేట్ అవుతుందనేది సినీ విశ్లేషకుల మాట.