గేమ్ ఛేంజర్ 7వ రోజు.. వినయ విధేయ రామ కంటే తక్కువే..
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం గేమ్ ఛేంజర్ సంక్రాంతి సందర్భంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 17 Jan 2025 1:06 PM GMTరామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం గేమ్ ఛేంజర్ సంక్రాంతి సందర్భంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్లు అందుకున్నా, బ్రేక్ ఈవెన్ కోసం పెట్టిన బడ్జెట్ ప్రకారం ఇంకా చాలా దూరం ఉందని చెప్పాలి. ఈ చిత్రానికి 221 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా 121.22 కోట్లు అవసరం. సినిమా మొదట అద్భుతమైన బజ్ క్రియేట్ చేసినప్పటికీ, సినిమా పట్ల ప్రేక్షకుల అభిప్రాయం ఆశించినంతగా ఉండలేదు.
సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో రెండో రోజుకే కలెక్షన్లపై ఎఫెక్ట్ పడింది. మొదటి రెండు రోజుల్లో బాగానే రాబట్టిన గేమ్ ఛేంజర్, ఆ తర్వాత వసూళ్లలో తగ్గుదల కనబడింది. పైగా పైరసీ వల్ల కూడా సినిమా రన్‌పై ప్రభావం పడినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం తొలిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టినా, వారం రోజులు పూర్తయ్యే సమయానికి కలెక్షన్లు ఆశించినంత స్థాయిలో లేవు.
తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టామినా చూపిస్తాయి. ఈ నేపథ్యంలో 7వ రోజు అతి ఎక్కువ షేర్లు రాబట్టిన టాప్ 5 సినిమాలు.. అల వైకుంఠపురములో (8.43 కోట్లు), బాహుబలి 2 (8.30 కోట్లు), సైరా (7.90 కోట్లు), సరిలేరు నీకెవ్వరు (7.64 కోట్లు), ఆర్ఆర్ఆర్ (7.48 కోట్లు). అయితే గేమ్ ఛేంజర్ ఈ లిస్ట్‌లో టాప్ 10లో కూడా చోటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.
ఇక 7వ రోజు టాలీవుడ్‌లో మరికొన్ని సినిమాల రికార్డులను పరిశీలిస్తే, కల్కి 2898 ఎ.డి. (6.04 కోట్లు), పుష్ప 2 (5.85 కోట్లు), ఖైదీ నంబర్ 150 (5.28 కోట్లు), వాల్తేరు వీరయ్య (4.85 కోట్లు), హనుమాన్ (4.55 కోట్లు) వంటి సినిమాలు టాప్ రేంజ్‌లో నిలిచాయి. అయితే గేమ్ ఛేంజర్ 7వ రోజు షేర్ కేవలం 1.73 కోట్లు మాత్రమే రావడం నిజంగా షాకింగ్.
గేమ్ ఛేంజర్ పూర్తి వసూళ్లు (గ్లోబల్):
తెలుగు రాష్ట్రాలు: ₹63.33 కోట్లు (గ్రాస్ ₹92.45 కోట్లు)
కర్ణాటక: ₹4.75 కోట్లు
తమిళనాడు: ₹3.95 కోట్లు
కేరళ: ₹0.25 కోట్లు
హిందీ & ROI: ₹16.60 కోట్లు
ఓవర్సీస్: ₹12.90 కోట్లు
మొత్తం WW కలెక్షన్స్: ₹101.78 కోట్లు (గ్రాస్ ₹185.15 కోట్లు)
టోటల్ గా చూస్తే గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇక ఏపీ తెలంగాణలో రామ్ చరణ్ కెరీర్‌లో మునుపటి డిజాస్టర్ అయిన వినయ విధేయ రామ కంటే కూడా తక్కువ 7వ రోజు వసూళ్లు రావడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
7వ రోజు తెలుగురాష్ట్రాల్లో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ షేర్ వసూలు చేసిన చిత్రాలు:
అల వైకుంఠపురములో - 8.43 కోట్ల షేర్
బాహుబలి 2 - 8.30 కోట్ల షేర్
సైరా - 7.90 కోట్ల షేర్
సరిలేరు నీకెవ్వరు - 7.64 కోట్ల షేర్
ఆర్ఆర్ఆర్ - 7.48 కోట్ల షేర్
కల్కి 2898 ఎ.డి. - 6.04 కోట్ల షేర్
పుష్ప 2: ది రూల్ - 5.85 కోట్ల షేర్
ఖైదీ నంబర్ 150 - 5.28 కోట్ల షేర్
వాల్తేరు వీరయ్య - 4.85 కోట్ల షేర్
హనుమాన్ - 4.55 కోట్ల షేర్
రంగస్థలం - 4.41 కోట్ల షేర్
ఎఫ్ 2 - 4.32 కోట్ల షేర్
బాహుబలి - 4.13 కోట్ల షేర్
భగవంత్ కేసరి - 3.56 కోట్ల షేర్
వినయ విధేయ రామ - 3.42 కోట్ల షేర్
వీరసింహారెడ్డి - 3.16 కోట్ల షేర్
అరవింద సమేత - 2.86 కోట్ల షేర్
గుంటూరు కారం - 2.83 కోట్ల షేర్
దేవర పార్ట్ 1 - 2.81 కోట్ల షేర్
అఆ - 2.73 కోట్ల షేర్
సరైనోడు - 2.66 కోట్ల షేర్
జైలర్ (డబ్) - 2.63 కోట్ల షేర్
మహర్షి - 2.41 కోట్ల షేర్
కేజీయఫ్ చాప్టర్ 2 (డబ్) - 2.43 కోట్ల షేర్
సలార్ - 2.22 కోట్ల షేర్
అత్తారింటికి దారేది - 2.16 కోట్ల షేర్
గీతగోవిందం - 2.11 కోట్ల షేర్
మజిలీ - 2.04 కోట్ల షేర్
కార్తికేయ 2 - 2.03 కోట్ల షేర్
బేబీ - 2.00 కోట్ల షేర్
శ్రీమంతుడు - 1.93 కోట్ల షేర్
సర్కారు వారి పాట - 1.82 కోట్ల షేర్
ప్రతి రోజు పండగే - 1.79 కోట్ల షేర్
క్రాక్ - 1.78 కోట్ల షేర్
భరత్ అనే నేను - 1.74 కోట్ల షేర్
గేమ్ ఛేంజర్ - 1.73 కోట్ల షేర్***