Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ డీల్

ఈ నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ కూడా మంచి వసూళ్లు అందుకుంటుందని భావిస్తున్నారు. నైజాం లోనే ఈ మూవీపైన 43.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందిని టాక్.

By:  Tupaki Desk   |   7 Jan 2025 1:30 AM GMT
రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ డీల్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఆల్ మోస్ట్ అన్ని ఏరియాలలో క్లోజ్ అయిపొయింది. సినిమాని మంచి ఫ్యాన్సీ ధరకి బయ్యర్లు కొనుక్కున్నారు. మొన్నటి వరకు సినిమాపై పెద్దగా సౌండ్ లేకపోయిన ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీపైన అంచనాలు కొంత వరకు పెరిగాయి. కచ్చితంగా ఈ సినిమాలో ఒకప్పటి శంకర్ మార్క్ కథ, కథనాలు ఉంటాయని అనుకుంటున్నారు.

అలాగే ఇండస్ట్రీ వర్గాలలో ఈ సినిమాపైన పాజిటివ్ వైబ్ నడుస్తోంది. కచ్చితంగా సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్స్ ని రాబడుతుందని భావిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగా హీరోలకి నైజాం ఏరియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలకి నైజాంలో మంచి కలెక్షన్స్ వస్తాయి.

ఈ నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ కూడా మంచి వసూళ్లు అందుకుంటుందని భావిస్తున్నారు. నైజాం లోనే ఈ మూవీపైన 43.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందిని టాక్. సోలోగా రామ్ చరణ్ కెరియర్ లోనే హైయెస్ట్ థీయాట్రికల్ బిజినెస్ ఈ సినిమాకి నైజాంలో జరిగింది. ఇంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి 70 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. దీని తర్వాత చిరంజీవితో కలిసి రామ్ చరణ్ చేసిన ‘ఆచార్య’ మూవీకి 38.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ అయ్యింది.

‘వినయ విధేయ రామ’ సినిమాపైన 24 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ కావడంతో బయ్యర్లకి నష్టాలు వచ్చాయి. ఈ సారి మాత్రం ‘గేమ్ చేంజర్’ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని నైజాంలో చాలా ఈజీగా క్రాస్ చేస్తుందని అనుకుంటున్నారు. టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రీమియర్ షోలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఎక్స్ ట్రా షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వొచ్చని అనుకుంటున్నారు.

సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా నైజాంలో ‘గేమ్ చేంజర్’ కలెక్షన్స్ ఊచకోత ఖాయం అని మేకర్స్ భావిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా చాలా రోజుల నుంచి ఆకలి మీద ఉన్నారు. మూవీపైన ఉన్న హైప్ ఉన్న నేపథ్యంలో మొదటి రోజు ఓపెనింగ్స్ కలెక్షన్స్ అయితే భారీగానే వస్తాయి. ఆ తరువాత మూవీ టాక్ బట్టి లాంగ్ రన్ వసూళ్లు ఆధారపడి ఉంటాయి. ‘పుష్ప 2’ మూవీ అయితే నైజాంలో 100 కోట్లకి పైగా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ సృష్టించింది. మరి ‘గేమ్ చేంజర్’ ఏ మేరకు కలెక్షన్స్ సాధిస్తుందనేది చూడాలి.