గేమ్ చేంజర్ ఇన్ సైడ్ టాక్ ఎంటంటే..
'గేమ్ చేంజర్' మూవీ ఫస్ట్ హాఫ్ అబౌవ్ ఏవరేజ్ గా ఉందని, సెకెండాఫ్ మాత్రం సూపర్ గా ఉంటుందనే మాట వినిపిస్తోంది.
By: Tupaki Desk | 27 Dec 2024 10:29 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫస్ట్ తెలుగు మూవీ. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కొంత హైప్ నెలకొని ఉంది. అదే సమయంలో మెగా ఫ్యాన్స్ లో ఈ సినిమా ఫలితం పైన భయం కూడా ఉంది.
'ఇండియన్ 2' లాంటి డిజాస్టర్ తర్వాత శంకర్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో ఎలా ఉంటుందా అనే ఆందోళన అందరిలో ఉంది. అయితే సోషల్ డ్రామాని తెరపై ఆవిష్కరించడంతో శంకర్ ఎక్స్ పెక్ట్. ఆయనకి సక్సెస్ ఇచ్చిన సినిమాలు అన్ని కూడా సామాజిక అంశాలతోనే తెరకెక్కాయి. 'గేమ్ చేంజర్' కూడా పొలిటికల్ సిస్టమ్ తో ఫైట్ చేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథగా చెప్పబోతున్నాడు.
రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. కచ్చితంగా అతను తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే డల్లాస్ లో జరిగిన 'గేమ్ చేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోందని చెప్పారు. తాను ఇప్పటికే సినిమా చూశానని, కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని రివ్యూ ఇచ్చారు.
ఇప్పుడు చెన్నై సినీ సర్కిల్ లో ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ టాక్ నడుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో అక్కడ కూడా మూవీపైన ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది. 'గేమ్ చేంజర్' మూవీ ఫస్ట్ హాఫ్ అబౌవ్ ఏవరేజ్ గా ఉందని, సెకెండాఫ్ మాత్రం సూపర్ గా ఉంటుందనే మాట వినిపిస్తోంది. అలాగే రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు.
ఫస్ట్ హాఫ్ లో చరణ్ కాలేజ్ సీన్స్ అలాగే విలన్ SJ సూర్య పవర్ఫుల్ ఇంట్రో ఎపిసోడ్స్ ఉంటాయట. ఇక పట్టుదలతో హీరో ఒక చాలెంజ్ లో ఎలా గెలిచాడు అనేది ఇంటర్వెల్ బ్లాక్ లో హైలెట్ అవుతుందని టాక్. సెకండ్ హాఫ్ లో అప్పన్న పాత్ర సామాజిక అంశాలు అలాగే పొలిటికల్ సీన్స్ ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అంజలి పాత్ర కూడా ఎమోషనల్ గా ఎట్రాక్ట్ చేస్తుందని ఇన్ సైడ్ టాక్.
ఈ టాక్ బట్టి చూస్తుంటే 'గేమ్ చేంజర్' మూవీతో శంకర్ బౌన్స్ బ్యాక్ అవ్వడం గ్యారెంటీ అనే మాట స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఎప్పుడో దశాబ్దం క్రితమే శంకర్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేశారు. అతని సినిమాలకి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. అయితే వరుస ఫెయిల్యూర్స్ కారణంగా కాస్తా ఇమేజ్ డౌన్ అయ్యింది.
గేమ్ చేంజర్ మాత్రం శంకర్ ని స్ట్రాంగ్ గా నిలబడుతుందని చెన్నై సర్కిల్ లో అనుకుంటున్నారు. ఒకప్పటి అతని హిట్ మూవీస్ తరహాలో బలమైన కథ, కథనాలతో ఈ చిత్రం ఉండబోతోందంట. రామ్ చరణ్ కి కూడా ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలి. అప్పుడే అతని మార్కెట్ స్టామినా ఏంటనేది తెలుస్తుంది.