Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ గేమ్ ఛేంజ్ చేసే స్టిల్స్..!

గ్లోబల్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Dec 2024 8:23 AM GMT
బాక్సాఫీస్ గేమ్ ఛేంజ్ చేసే స్టిల్స్..!
X

గ్లోబల్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు. గేమ్ ఛేంజర్ సినిమాతో చరణ్ మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే సినిమా కోసం తన బెస్ట్ ఇచ్చేస్తున్నాడు. 2025 సంక్రాంతికి తన మార్క్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేలా ప్రయత్నిస్తున్నాడు చరణ్.

ఈ సినిమా విషయం నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. మరోపక్క సినిమాలో నటించిన శ్రీకాంత్, నిర్మాత దిల్ రాజు వేరు వేరు సందర్భాల్లో సినిమా గురించి చేసిన కామెంట్స్ మరింత హైప్ ఏర్పడేలా చేశాయి. ఐతే గేమ్ ఛేంజర్ సినిమాతో బాక్సాఫీస్ పై తన పంజా విసరాలని చూస్తున్న చరణ్ ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

శంకర్ ఇండియన్ 2 ఫ్లాప్ అయినా కూడా గేమ్ ఛేంజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని అంటున్నారు. ముఖ్యంగా సినిమా నుంచి వస్తున్న ప్రచార చిత్రాలు సినిమాపై కావాల్సినంత బజ్ పెంచేస్తున్నాయి. లేటేస్ట్ గా సినిమా నుంచి మరికొన్ని ఫోటోస్ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలో చరణ్ రెండు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నారని తెలిసిందే. సినిమాలో తండ్రి కొడుకులుగా చరణ్ కనిపించనున్నారు. ఒక పాత్ర ఓల్డ్ గా ఉంటే మరో పాత్ర యంగ్ లుక్ తో కనిపిస్తుంది.

ఐతే ఇద్దరు చరణ్ లు ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తారా లేదా అన్నది తెలియదు కానీ ఒకవేళ శంకర్ అలాంటి షాట్ ఒకటి ప్లాన్ చేస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే అని చెప్పొచ్చు. పక్కా కమర్షియల్ కొలతలతో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా గేమ్ ఛేంజర్ వస్తుంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ అవుతుందని తెలుస్తుంది. మరి చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ ఎలాంటి బ్లాస్ట్ చూపిస్తుంది అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. శంకర్ మార్క్ గ్రాండియర్ కి ఏమాత్రం తగ్గకుండా వస్తున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కు ఏమేరకు మెగా మాస్ ట్రీట్ అందిస్తుందో చూడాలి.