నార్త్ ఇండియాలో గేమ్ ఛేంజ్ అంత ఈజీ కాదా..!
రామ్ చరణ్ ఆర్ఆర్‌ఆర్ సినిమా నార్త్ ఇండియాలో మంచి వసూళ్లు సాధించినప్పటికీ గేమ్ ఛేంజర్‌కి నార్త్ ఇండియాలో బిజినెస్ అంతంత మాత్రంగానే అవుతుంది.
By: Tupaki Desk | 17 Dec 2024 8:23 AM GMTపుష్ప 2 సినిమా నార్త్ ఇండియాలో సాధిస్తున్న వసూళ్లు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌కి సైతం షాకింగ్‌గా ఉన్నాయి. రెండో వీకెండ్‌లో వంద కోట్లకు పైగా సాధించిన ఏకైక సినిమాగా పుష్ప 2 నిలిచింది. వీక్ డేస్‌లోనూ నార్త్ ఇండియాలో వస్తున్న వసూళ్లు చూస్తుంటే మతి పోతుంది. తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ప్రేక్షకులు పుష్ప 2ను ఎక్కువ ఆధరిస్తున్నారు. రెండో ఆదివారం పుష్ప 2 థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డ్‌లు కనిపించాయి. మామూలుగానే పుష్ప 2 కి భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. నార్త్ ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో ఇతర సినిమాలు ఆ రికార్డ్‌లను బ్రేక్ చేయడానికి కష్టపడాల్సిన పరిస్థితి ఉంది.
దేశ వ్యాప్తంగా పుష్ప 2 సినిమా రాబడుతున్న వసూళ్లను రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బ్రేక్ చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నార్త్ ఇండియాలో మాత్రం గేమ్ ఛేంజర్ కనీసం పుష్ప 2 రాబట్టిన వసూళ్లలో కనీసం సగం రాబట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు అక్కడ కనీసం బజ్ క్రియేట్ అవ్వలేదు. అందుకే సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీజర్‌ను విడుదల చేసిన తర్వాత కాస్త తెలుగులో పరిస్థితి మారింది. కానీ ఇతర భాషల్లో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పెద్దగా బజ్ క్రియేట్ అవుతున్న పరిస్థితి కనిపించడం లేదు.
రామ్ చరణ్ ఆర్ఆర్‌ఆర్ సినిమా నార్త్ ఇండియాలో మంచి వసూళ్లు సాధించినప్పటికీ గేమ్ ఛేంజర్‌కి నార్త్ ఇండియాలో బిజినెస్ అంతంత మాత్రంగానే అవుతుంది. అయినా నిర్మాతలు విడుదల తర్వాత పరిస్థితి మారుతుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధ్యమే కానీ, తెలుగు రాష్ట్రాల బయట ఈ సినిమా ఎంత మేరకు వసూళ్లు సాధిస్తుంది, ముఖ్యంగా మొదటి రోజు రాబట్టే వసూళ్లు ఎన్ని అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కచ్చితంగా పుష్ప 2 సినిమా మొదటి రోజు వసూళ్లను గేమ్ ఛేంజర్ చేరుకునే అవకాశం లేదు. టికెట్ల రేట్లు అంత పెరిగే అవకాశం లేదు, అలాగే సినిమాకు ప్రీమియర్ షో లే లేవు. కనుక రికార్డ్‌ల వేట అంత ఈజీ కాదు.
ముఖ్యంగా నార్త్ ఇండియాలో గేమ్ ఛేంజర్‌ను ముందుకు తీసుకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. అక్కడ రూ.100 కోట్ల వసూళ్లు రాబడితే గొప్ప విషయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అక్కడ చేసిన బిజినెస్ తక్కువే అయినా వసూళ్లు ఎక్కువ ఉంటాయనే నమ్మకంను మాత్రం మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుంది చూడాలి అంటే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. చరణ్, శంకర్ కాంబోలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా కియారా అద్వానీ, అంజలిలు హీరోయిన్స్ గా నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.