తారక్-బన్నీ మధ్యలో చరణ్ పై ఒత్తిడి!
ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇది అతడిని తీవ్ర ఒత్తిడికి గురి చేసే అంశం. అన్నింటని మించి చరణ్ సోలోగా కొట్టాల్సిన సమయం ఇది.
By: Tupaki Desk | 11 Dec 2024 10:30 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' పాన్ ఇండియాలో ఎంత్త పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. 'దేవర' విజయంతో రాజమౌళి సెంటిమెంట్ ని సైతం తారక్ బ్రేక్ చేసాడు. 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత తారక్ కి పాన్ ఇండియాలో సోలో గా వచ్చిన సక్సెస్ అది. అటుపై 'పుష్ప-2' రూపంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో భారీ పాన్ ఇండియా అందుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త రికార్డులు నమోదు చేసింది.
అంచనాలను మించి సంచలనాలు అయిన చిత్ర మిది. అంతకు ముందు 'పుష్ప' తో నార్త్ బెల్ట్ లో పాగా వేసిన బన్నీ రెండవ భాగంతో ఏకంగా ఖాన్ లు ..కపూర్ లనే పక్కకు నెట్టేసాడు. 'పుష్ప-2' నార్త్ బ్లాస్టింగ్ చూసి అక్కడ హీరోలకే దిమ్మ తిరిగిపోతుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ రణ్ నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.
కానీ అవి సంచలనాలు అవుతాయా? అన్నదే తేలాల్సి ఉంది. చాలా కాలంగా శంకర్ కి సరైన విజయాలు పడలేదు. దీనికి తోడు ఆయన గత చిత్రం 'ఇండియన్ -2' ఘోర పరాజయం కూడా వెంటాడుతుంది. ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇది అతడిని తీవ్ర ఒత్తిడికి గురి చేసే అంశం. అన్నింటని మించి చరణ్ సోలోగా కొట్టాల్సిన సమయం ఇది. గత సినిమా 'ఆర్ ఆర్ ఆర్' విజయం అన్నది తారక్ తో షేరింగ్ మాత్రమే. అది అతడి సోలో సక్సెస్ కాదు.
పాన్ ఇండియాలో ఆ సినిమా ఓ గుర్తింపును తీసుకొచ్చింది. అంతకు ముందు బాలీవుడ్ లో రీమేక్ చేసిన 'జంజీర్' అట్టర్ ప్లాప్ అయింది. ఆ తర్వాత మళ్లీ హిందీలో చరణ్ సినిమాలు రిలీజ్ అవ్వలేదు. దీంతో 'గేమ్ ఛేంజర్' ఇప్పుడా లెక్కలన్నింటిని సరి చేయాల్సి ఉంది. చరణ్ సోలోగా పాన్ ఇండియా సక్సెస్ అందుకుని కాలర్ ఎగరేయాల్సిన సమయం ఇది.