గేమ్ ఛేంజర్ టీజర్.. వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు
"బేసిక్ గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు.. కానీ కోపం వస్తే.. వాడంతా చెడ్డోడు ఇంకొకడు ఉండడు" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది.
By: Tupaki Desk | 9 Nov 2024 12:49 PM GMTఆర్ఆర్ఆర్ తర్వాత సోలోగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.
సినిమాలో రామ్ చరణ్, కియారా, అంజలితో పాటు సముద్ర ఖని, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. పలుమార్లు వాయిదా తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయనున్నారు. జనవరి 10వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇటీవల మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.
రీసెంట్ గా ఓ కార్యక్రమంలో దిల్ రాజు ప్రమోషన్స్ ప్లాన్ రివీల్ చేసి షాక్ ఇచ్చారు! భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా నేడు టీజర్ రిలీజ్ ఈవెంట్ ను లక్నోలో ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న టీజర్.. అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తోంది. సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు పెంచుతోంది.
"బేసిక్ గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు.. కానీ కోపం వస్తే.. వాడంతా చెడ్డోడు ఇంకొకడు ఉండడు" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ పోషిస్తున్న వివిధ రోల్స్ ను రివీల్ చేశారు. స్టైలిష్ గా బైక్ పై వస్తున్న చరణ్ ఎంట్రీ ఇచ్చారు. వైట్ కలర్ పంచె లో నడుస్తూ కనిపించారు. ఆఫీసర్ గా కూడా సందడి చేశారు. కియారాతో లవ్ ట్రాక్ ను రివీల్ చేశాక సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు.
చివర్లో చరణ్.. అన్ ప్రిడెక్టబుల్ అంటూ ఆసక్తి పెంచారు. మొత్తానికి స్టోరీ లైన్ క్లియర్ గా రివీల్ చేయకుండా టీజర్ ను ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు మేకర్స్. చరణ్ మరోసారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే విధంగా కనిపిస్తున్నారు. విభిన్నమైన రోల్స్ లో మెప్పించారు. అన్ని పాత్రల్లో కూడా ఒదిగిపోయారు. యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టారు. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మొత్తానికి టీజర్ ఓవరాల్ గా ఆకట్టుకుంటోంది.