బాలకృష్ణతో గేమ్ ఛేంజర్..!
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్ చరణ్ అండ్ టీం బాలకృష్ణతో కలిసి అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నారట.
By: Tupaki Desk | 29 Dec 2024 12:58 PM GMTనందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 4 కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే పలువురు స్టార్స్ బాలకృష్ణ ముందు కూర్చున్నారు. ఇటీవల వెంకటేష్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నాం టీం మెంబర్స్ అన్‌స్టాపబుల్‌లో పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్ అయ్యింది. తదుపరి ఎపిసోడ్‌లో రామ్ చరణ్ సందడి చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్ చరణ్ అండ్ టీం బాలకృష్ణతో కలిసి అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నారట.
రామ్ చరణ్ గతంలోనే అన్‌స్టాపబుల్‌కి హాజరు కాబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల వీలు పడలేదు. కానీ రామ్ చరణ్‌తో అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో బాలకృష్ణ పోన్‌లో మాట్లాడాడు. ఆ సమయంలోనే షోకి వస్తాను అంటూ చరణ్ చెప్పాడని, ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా కోసం రాబోతున్నాడని తెలుస్తోంది. దిల్ రాజు, శంకర్‌లు సైతం ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో పాల్గొనబోతున్నారు. హీరోయిన్స్‌లో కియారా అద్వానీ లేదా అంజలి ఈ ఎపిసోడ్‌లో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆహా ఓటీటీ ద్వారా ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతోంది.
బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సైతం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే వెంకటేష్ సినిమా అన్‌స్టాపబుల్‌లో ప్రమోట్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే బాలకృష్ణ డాకు మహారాజ్ టీం మెంబర్స్ సైతం అన్‌స్టాపబుల్‌లో పాల్గొనబోతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతి లోపు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ టీం మెంబర్స్ పాల్గొన్న అన్‌స్టాపబుల్ టాక్ షోకి సంబంధించిన ఎపిసోడ్స్‌లు స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆహా టీం మెంబర్స్ ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.
రామ్ చరణ్ నాలుగు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా రాబోతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించగా శంకర్ సినిమాకు దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ సినిమాను ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాకి డల్లాస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాపై అంచనాలు పెంచే విధంగా టీజర్ ఉంది. అంతే కాకుండా ట్రైలర్‌ను అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్ దర్శకుడు ఎస్ జే సూర్య కీలకమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.