Begin typing your search above and press return to search.

బడా బాలీవుడ్ మేకర్ తో చరణ్.. నిజమేనా?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Feb 2025 2:13 PM GMT
బడా బాలీవుడ్ మేకర్ తో చరణ్.. నిజమేనా?
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఆ సినిమా.. భారీ అంచనాల మధ్య రిలీజైంది. కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఇప్పుడు చరణ్.. తన అప్ కమింగ్ మూవీపై ఆశలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో వర్క్ చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న RC 16 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే చిత్రీకరణను మొదలుపెట్టిన మేకర్స్.. ఇప్పుడు హైదరాబాద్ లో షూట్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో కీలక షెడ్యూల్ ను పూర్తి చేయనున్నట్లు టాక్.

అనంతరం కాకినాడ తీరంలో చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉప్పాడ బీచ్ స‌మీపంలో షూట్ కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని సమాచారం. మొత్తానికి నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్న చరణ్.. సినిమా కోసం ఫుల్ గా మేకోవర్ అయిన విషయం తెలిసిందే. 2025లోనే RC 16తో సందడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదే సమయంలో ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా కిల్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న నగేష్ భట్ తో చరణ్ మూవీని కరణ్ జోహార్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.

అయితే కొంతకాలం క్రితం.. స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కరణ్ జోహర్ ఓ సినిమా తీయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు చరణ్ తో ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో కరణ్ జోహార్ తెలుగు సినీ ప్రియులకు సుపరిచితులే.

చరణ్ ఒక్కరితోనే కాకుండా.. మరో రెండు మూడు మిడ్ రేంజ్ సినిమాలను కూడా రూపొందించేందుకు కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రొడక్షన్ ఖర్చు సహా పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరణ్ పెద్ద ప్లానే చేసినట్లు ఉన్నారని అంతా అంటున్నారు. మరి నిజమో కాదో చూడాలి.