షారూఖ్- సుహానాలా.. చరణ్- క్లిన్ కారా
తండ్రి లెగసీని ముందుకు నడిపించే సిసలైన నటవారసురాలవుతుందనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 16 Feb 2025 3:10 AM GMTకింగ్ ఖాన్ షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్ ని చూడగానే డిట్టో షారూఖ్ ని చూసినట్టే ఉంటుంది. ఒకవేళ పరిశ్రమ నుంచి షారూఖ్ నిష్కృమిస్తే, అతడికి మరో రూపంగా సుహానా చెలామణి అయిపోతుంది. తండ్రి లెగసీని ముందుకు నడిపించే సిసలైన నటవారసురాలవుతుందనడంలో సందేహం లేదు. తన రంగు రూపం ఆహార్యం ప్రతిదీ షారూఖ్ కి డిట్టో. తండ్రి పోలికలతో అచ్చు గుద్దినట్టు ఉండే సుహానా ఖాన్ తన తండ్రిలానే చిలిపిదనాన్ని, అల్లరిని తెరపై పండిస్తే, అది కచ్ఛితంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు.
తండ్రుల పోలికలతో కుమార్తెలు కనిపిస్తే అది కచ్ఛితంగా అభిమానులను ఎగ్జయిట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఎగ్జయిట్ మెంట్ సుహానా పెద్ద తెర ఆరంగేట్రంపైనా ఉత్కంఠను పెంచుతోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ వారసురాలు క్లిన్ కారాను పరిశీలనగా గమనించిన ఫ్యాన్స్ తనను తండ్రితో పోల్చి చూస్తున్నారు. తాజాగా లీకైన ఎయిర్ పోర్ట్ లుక్ వీడియోలో క్లిన్ కారా రూపం ఎలా ఉంటుందో బయటపడింది. ఉపాసన- రామ్ చరణ్ ఇంతకాలం క్లిన్ కారా పూర్తి రూపాన్ని బయటి ప్రపంచానికి ఇప్పటివరకూ రివీల్ చేయలేదు. కానీ విమానాశ్రయంలో డాడీ చరణ్ తో పాటు వెళుతున్న క్లిన్ కారా వీడియో లీక్ కావడం, అందులో తన ముఖాకృతి స్పష్ఠంగా కనిపించడంతో తనను చూసిన అభిమానులు `డాడీ లిటిల్ గర్ల్` అంటూ పొగిడేస్తున్నారు. అచ్చం తండ్రిని పోలి ఉందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. పెద్ద కళ్లు, అందమైన ముక్కు తీరైన రూపంతో క్యూట్ క్లిన్ కారా ఆకట్టుకుంటోంది.
ఇటీవలే బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న మూవీ సెట్స్ లోకి క్లిన్ అడుగుపెట్టింది. గారాల పట్టీ తన డాడీకి చేత్తోనే సైగలు చేస్తూ క్యూట్ గా కనిపించింది. అయితే ఆ వీడియోలో క్లిన్ కారా రూపం అస్సలు రివీల్ కాలేదు. ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లో క్యూట్ కిడ్ రూపం స్పష్ఠంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. చరణ్ కి సిసలైన వారసురాలు వస్తోంది! అంటూ మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్ లో స్పోర్ట్స్ మూవీ చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే.