రామ్ చరణ్ కు బాలీవుడ్ ఆఫర్?
ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 12 March 2025 9:00 PM ISTతమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన గేమ్ ఛేంజర్ ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. మెగా ఫ్యాన్స్ ఆశలన్నింటి పైనా గేమ్ ఛేంజర్ నీళ్లు చల్లింది. రామ్ చరణ్ మాత్రం గేమ్ ఛేంజర్ రిజల్ట్ ను పక్కన పెట్టేసి తన తర్వాతి సినిమా కోసం రెడీ అయిపోయి, ఆల్రెడీ దానికి సంబంధించిన షూటింగ్ ను కూడా మొదలుపెట్టాడు.
చరణ్ తన తర్వాతి సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేసుకున్నాడు.
బుచ్చిబాబు సినిమా తర్వాత రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఆల్రెడీ కమిటయ్యాడు. కానీ సుకుమార్ చరణ్ తో సినిమాను మొదలుపెట్టడానికి చాలా టైమ్ పట్టేట్టుంది. సినిమా స్క్రిప్ట్ కోసమే సుకుమార్ దాదాపు ఏడాది సమయం తీసుకోవాలనుకుంటున్నాడు. దాంతో పాటూ సుకుమార్ సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ లో కూడా తనకు కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి.
అంటే బుచ్చిబాబు సినిమా పూర్తయ్యాక సుకుమార్ మూవీ మొదలు పెట్టేలోపు చరణ్ కొంత కాలంపాటూ ఫ్రీ గా ఉండనున్నాడు. ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండకుండా ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట చరణ్. అందులో భాగంగానే చరణ్ కొంతమందితో చర్చలు జరుపుతున్నాడని సమచారం. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో చరణ్ స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ చేస్తున్నాడని తెలుస్తోంది.
కొందరు హిందీ డైరెక్టర్లు చరణ్ తో డిస్కషన్స్ చేస్తున్నారని కానీ ఆ చర్చలన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని టాక్. ఇప్పటికైతే ఇంకా ఏదీ ఫిక్సవలేదు కానీ సరైన స్క్రిప్ట్, డైరెక్టర్ దొరికితే మధు మంతెన నిర్మాణంలోనే సినిమా చేయాలని చూస్తున్నాడు చరణ్. మధు మంతెనకు, చరణ్ తో మంచి బాండింగ్ ఉంది. చరణ్ ముంబైలో ఉన్నప్పుడు మధునే అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. మరి బాలీవుడ్ లో చరణ్ ను ఏ డైరెక్టర్ మెప్పిస్తాడో చూడాలి.