ఆర్సీ16 సెట్స్ నుంచి చరణ్ లుక్ వైరల్!
ప్రస్తుతం రామ్ చరణ్ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది.
By: Tupaki Desk | 13 March 2025 5:27 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ప్రస్తుతం రామ్ చరణ్ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది.
ఈ ఫోటోలో చరణ్ వైట్ టీ షర్ట్ పై బ్లాక్ కలర్ స్వెట్ షర్ట్ వేసుకుని, నల్ల కళ్లద్దాలు ధరించి, స్టైల్ గా టోపీ పెట్టుకుని గుబురు కడ్డంతో ఎంతో కూల్ గా కనిపిస్తున్నాడు. చరణ్ లుక్ ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. వీటన్నింటి కంటే భిన్నంగా ఫోటోలో ఉన్న చిన్నపిల్లాడిని చరణ్ తన దగ్గరకు తీసుకుని మరీ ఫోటోకు పోజివ్వడం అందరినీ స్పెషల్ గా ఎట్రాక్ట్ చేస్తుంది.
ఈ ఫోటోలో ఉన్న బాబు మరెవరో కాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వ కొడుకే. గత కొన్నాళ్లుగా హైదరాబాద్ లో జరుగుతున్న ఆర్సీ16లో విశ్వ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా విశ్వ తన ఫ్యామిలీని సెట్స్ కు తీసుకెళ్లి ఫ్రీ టైమ్ లో రామ్ చరణ్ ను కలిసి ఫోటో దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని పోస్ట్ చేశాడు.
ఇక ఆర్సీ16 విషయానికొస్తే ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే చరణ్ కు మరో రెండు వారాల్లో 40 ఏళ్లు నిండనున్నాయి. మెగా ఫ్యాన్స్ చరణ్ బర్త్ డే కు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. చరణ్ బర్త్ డే సందర్బంగా అతని బ్లాక్ బస్టర్ సినిమా నాయక్ ను 4కె లో రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ కొత్త లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆయన ఫ్యాన్స్ మాత్రం ఈసారి తమ హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ ను మునుపెన్నడూ జరగని విధంగా చేయాలని డిసైడయ్యారు. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్సీ16 నుంచి కూడా ఏదొక అప్డేట్ ఉండే వీలుంది.