Begin typing your search above and press return to search.

చరణ్ మాస్ లుక్ చాలంటున్న ఫ్యాన్స్..!

ఆర్సీ 16 లో చరణ్ లుక్ ఏమో కానీ ఈమధ్య గ్లోబల్ స్టార్ ఎక్కడ కనిపించినా గుబురు గడ్డంతో కనిపించి సర్ ప్రైజ్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   11 March 2025 7:00 AM IST
చరణ్ మాస్ లుక్ చాలంటున్న ఫ్యాన్స్..!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏం చేసినా సరే మెగా ఫ్యాన్స్ కి అదో కిక్ ఇస్తుంది. గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో నిరాశ పడిన ఫ్యాన్స్ ఆ తర్వాత ఆరెంజ్ రీ రిలీజ్ తో హంగామా చేశారు. సినిమా రీ రిలీజ్ లో సరికొత్త సంచలనాలు సృష్టించాయి. ఇక చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పీరియడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతుంది. సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.

ఐతే సినిమాలో చరణ్ లుక్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పటివరకు తెలియలేదు. ఆర్సీ 16 లో చరణ్ లుక్ ఏమో కానీ ఈమధ్య గ్లోబల్ స్టార్ ఎక్కడ కనిపించినా గుబురు గడ్డంతో కనిపించి సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఒకవేళ చరణ్ సినిమాలో కూడా అదే లుక్ అయితే ఫ్యాన్స్ కి పండగే అనేలా ఉంది. లేటెస్ట్ గా చరణ్ ఒక ఫంక్షన్ లో అటెండ్ అయ్యాడు. అక్కడ సూట్ లో గడ్డం లుక్ తో అదరగొట్టాడు.

అది చూసిన మెగా ఫ్యాన్స్ అయితే ఈ లుక్ చాలు రికార్డుల సంగతి మేం చూసుకుంటాం అంటున్నారు. ఆల్రెడీ ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు రాం చరణ్ సినిమా కోసం చాలా ఫోకస్ గా పనిచేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా మరో సంచలనంగా మారుతుందని చిత్ర యూనిట్ నమ్ముతున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.

సో సినిమాపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే వాటి మీద ఇంకా హై తెచ్చేలా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు బుచ్చి బాబు. సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టాలనే ఆలోచన ఉన్నా ఆ టైటిల్ పై ఫ్యాన్స్ అంతగా ఉత్సాహంగా లేరన్న టాక్ ఉంది. RRR తర్వాత ఆచార్య, గేం చేంజర్ రెండు సినిమాలు చరణ్ కి అంత కిక్ ఇవ్వలేదు. ఐతే ట్రిపుల్ ఆర్ తర్వాత పర్ఫెక్ట్ పాన్ ఇండియా బొమ్మగా బుచ్చి బాబు సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నేషనల్ లెవెల్ లోనే కాదు గ్లోబల్ లెవెల్ లో ఆడియన్స్ అటెన్షన్ ఏర్పడేలా చేస్తున్నారట. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా ది బెస్ట్ అనిపించుకుంటుందని టాక్.