Begin typing your search above and press return to search.

RC 16 వెనుక సుక్కు..?

రాంచరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2025 4:00 AM IST
RC 16 వెనుక సుక్కు..?
X

గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు చేస్తున్న ఈ సినిమా పీరియాడికల్ కథతో వస్తుందని తెల్స్తుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలు కాగా శరవేగంగా జరుపుకుంటుంది. రాంచరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఐతే ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామ్యం అవుతుంది. ఐతే సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెనకు కూడా సుకుమార్ సపోర్ట్ చేశాడు. ఇప్పుడు రెండోది చరణ్ తో చేస్తున్న సినిమాకు కూడా సుకుమార్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తుంది. కథ డైరెక్షన్ బుచ్చి బాబే చేస్తున్నా సినిమా అవుట్ పుట్ చూసి తన సలహాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

అంతేకాదు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కూడా సుకుమార్ డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలు పెడుతున్నట్టు తెలుస్తుంది. సో చరణ్ చేస్తున్న నెక్స్ట్ రెండు సినిమాలకు సుకుమార్ సపోర్ట్ ఉండబోతుంది. పుష్ప 1, 2 సినిమాల తర్వాత సుకుమార్ రేంజ్ ఏంటన్నది తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో సుకుమార్ సెన్సేషనల్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు.

పుష్ప 2 చివర్లో పుష్ప 3 అని ట్విస్ట్ ఇచ్చినా కూడా అది ఇప్పుడప్పుడే ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. రాం చరణ్ బుచ్చి బాబు సినిమా తర్వత సుకుమార్ తో సినిమా లైన్ లో ఉంది కాబట్టి ఆ సినిమా షూటింగ్ మొదలయ్యే దాకా రిలాక్స్ మోడ్ లో ఉండనున్నాడు సుకుమార్. ఐతే బుచ్చి బాబు సినిమాకు కూడా సుకుమార్ హ్యాండ్ ఉంటుందని తెలుస్తున్నా ఉప్పెనలానే సుక్కు వెనక ఉండి బుచ్చి బాబు కి అండగా నిలుస్తాడు తప్ప సినిమా డైరెక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

RC 16, 17 సినిమాలపై మెగా ఫ్యాన్స్ సూపర్ ఎగైటెడ్ గా ఉన్నారు. ఈ సినిమాలతో గ్లోబల్ లెవెల్ లో రాం చరణ్ స్టామినా ప్రూవ్ చేస్తాడని అనుకుంటున్నారు. బుచ్చి బాబు, సుకుమార్ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు బింబిసార డైరెక్టర్ వశిష్ట కూడా ఆసక్తిగా ఉన్నాడని టాక్. ప్రస్తుతం అతను చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నారని తెలిసిందే.