'ఆరెంజ్' లవ్ స్టోరీ వెనుక సీక్రెట్ అదా!
'ఆరెంజ్' అనే టైటిల్ అందుకు పెట్టాం. కథ పరంగా పర్పెక్ట్ గా టైటిల్ కుదిరింది. కానీ సినిమా కనెక్ట్ అవ్వలేదు' అని అన్నారు. అదీ ఆరెంజ్ సంగతి.
By: Tupaki Desk | 17 Feb 2025 4:58 PM GMTరామ్ చరణ్ కథానాయకుడిగా భాస్కర్ తెరకెక్కించిన 'ఆరెంజ్' లవ్ స్టోరీ ప్రేక్షకులకు అర్దంకాక ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. 2010లో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పటి యువతకు ఈ సినిమా కనెక్ట్ అవ్వలేదు. కానీ చరణ్ మెచ్చిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు మాత్రం రామ్ చరణ్ బాగా కనెక్ట్ అయ్యాడు. సినిమా ప్లాప్ అయినా ఇప్పటికీ చరణ్ అప్పుడప్పుడు 'ఆరెంజ్' చూస్తుంటానని చెబుతుం టాడు.
ఇది చాలా అడ్వాన్స్ మూవీ అందుకే జనాలకు ఎక్కలేదని అంటుంటున్నారు. అయితే ఈ సినిమా రెండు సార్లు రీ -రిలీజ్ అయింది. గత ఏడాది చరణ్ పుట్టిన రోజు సందర్భంగా... ఈ ఏడాది ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయి మంచి సక్సెస్ అయింది. రీ-రిలీజ్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆరెంజ్' లవ్ స్టోరీ వెనుక ఉన్న అసలు కథని ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ రివీల్ చేసారు.
'ఒక డే లో 24 గంటల్లో బ్లాక్ స్కై ఎక్కువ ఉంటుంది. బ్లూ స్కై ఎక్కువ ఉంటుంది. మబ్బులు ఉంటే వైట్ స్కై కనిపిస్తుంది. కానీ ఆరెంజ్ లైట్ అన్నది ఉదయం ఎర్లీ అవర్స్ లో అరగంట... సాయంత్రం 20...15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మన జీవితంలో స్వచ్ఛమైన ప్రేమ కూడా అంతే సేపు ఉంటుంది అన్నది భాస్కర్ చెప్పాడు. కానీ దీన్ని మేము సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాం.
'ఆరెంజ్' అనే టైటిల్ అందుకు పెట్టాం. కథ పరంగా పర్పెక్ట్ గా టైటిల్ కుదిరింది. కానీ సినిమా కనెక్ట్ అవ్వలేదు' అని అన్నారు. అదీ ఆరెంజ్ సంగతి. అయితే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా విదేశాల్లో ఉండటం కూడా సినిమాకి మైనస్ గా రివ్యూలు వచ్చాయి. అదే కథని ఇండియా బ్యాక్ డ్రాప్ లో చెప్పి ఉంటే? కనెక్ట్ అయ్యేది అన్నది కొందరి భావన.