ఈ పెద్ది చిట్టిబాబుని డామినేట్ చేస్తాడా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తర్వాత చేస్తున్న సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.
By: Tupaki Desk | 27 March 2025 9:30 AMగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తర్వాత చేస్తున్న సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా పెద్ది అని పెట్టారు. నేడు చరణ్ బర్త్ డే సందర్భంగా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. పెద్దిగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అరాచకం అనిపించేశాడు.
పర్ఫెక్ట్ మాస్ లుక్ తో పోస్టర్ తోనే ఫ్యాన్ ఫీస్ట్ అయ్యేలా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు బుచ్చి బాబు. అసలు పెద్ది పోస్టర్ తోనే సూపర్ హై వచ్చేలా చేశాడు. అందుకే ఇలా రిలీజై అయ్యిందో లేదో అలా సెన్సేషన్ రెస్పాన్స్ అందుకుంది. మెగా ఫ్యాన్స్ అయితే ఈ పోస్టర్ తోనే పూనకాలు లోడింగ్ అనేస్తున్నారు.
ఉప్పెనతో తొలి సినిమాతోనే 100 కోట్లు కొట్టి తన డైరెక్షన్ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు బుచ్చి బాబు. ఇక తన రెండో సినిమానే గ్లోబల్ స్టార్ తో చేస్తున్నాడు. సినిమా కథ ఎంత బాగా వచ్చుంటే చరణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ చెప్పాడన్నది అర్ధం చేసుకోవచ్చు. పెద్ది సినిమా పీరియాడికల్ స్పోర్ట్స్ కథతో వస్తుంది. సినిమాలో చరణ్ ఆట కూలీగా కనిపిస్తాడని టాక్.
పెద్ది ఫస్ట్ లుక్ చూస్తే రంగస్థలం చిట్టి బాబు గుర్తు రాక మానదు. ఐతే అది విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ. చరణ్ లోని అసలు నటుడిని పరిచయం చేసింది రంగస్థలం తోనే.. అప్పటి నుంచి చరణ్ అదరగొట్టేస్తున్నాడు. రంగస్థలం చిట్టి బాబు పాత్ర ఇప్పటివరకు చరణ్ కెరీర్ బెస్ట్ అనేస్తారు.
అఫ్కోర్స్ RRR లో రామరాజు కూడా అదే వరుసలో ఉంది. ఐతే పెద్ది సినిమాలో చరణ్ తన పాత్రతో చిట్టి బాబుని డామినేట్ చేస్తాడా అన్న డౌట్ మొదలవుతుంది. సినిమా కథనాలు ఎలా ఉన్నా ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలి ప్రజేక్ట్ పై అంచనాలు పెంచాడు బుచ్చి బాబు.
రంగస్థలంలో చిట్టి బాబు విధ్వంసం చేయగా ఈ పెద్ది ఆ చిట్టు బాబుని డామినేట్ చేస్తాడా అన్నది చూడాలి. ఆట కూలీగా చరణ్ గెటప్పు, లుక్క్ అదిరిపోయింది. క్యారెక్టరైజేషన్ కూడా వేరే లెవెల్ అనేలా ఉంటుందట. చూస్తుంటే ఈ పెద్ది చాలా పెద్ద సంచలనాలకే కేంద్రంగా నిలిచేలా ఉన్నాడు. సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత రవి శంకర్ కూడా టీజర్ లో ఒక్క షాట్ కోసమే 1000 సార్లు చూస్తారని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు.