Begin typing your search above and press return to search.

పెద్ది.. అసలైన సర్ ప్రైజ్ ఈ పండక్కే..

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాల డోస్ మరో లెవెల్ కు వెళ్ళాయి. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

By:  Tupaki Desk   |   28 March 2025 5:32 PM
పెద్ది.. అసలైన సర్ ప్రైజ్ ఈ పండక్కే..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది బిగ్ సక్సెస్ అవ్వాలని అభిమానులు గట్టి ఆశలే పెట్టుకున్నారు.మ్. సినిమా ఎనౌన్స్ చేసినప్పుడే కంటెంట్ లీక్స్ క్యూరియసిటీని పెంచాయి. ఇక షూటింగ్ కొనసాగుతున్నప్పుడే మేకర్స్ ఎప్పటికప్పుడు వర్క్ కు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాల డోస్ మరో లెవెల్ కు వెళ్ళాయి. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక ఫస్ట్ లుక్‌కి స్పందన విషయంలో కొన్ని భిన్నమైన అభిప్రయలు

చరణ్ లుక్ ‘పుష్ప’లో అల్లు అర్జున్ లుక్‌ను గుర్తు చేస్తుందన్న అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి. స్టైల్, బాడీ లాంగ్వేజ్, సిగరెట్ హోల్డ్ స్టిల్ ఇలా చాలానే పోలికలు కనిపిస్తున్నాయంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. పైగా, రఫ్ అండ్ మాస్ లుక్‌లో చరణ్‌కు సరైన మేకోవర్ ఇవ్వలేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫస్ట్ లుక్ మీద ఏర్పడ్డ నెగటివ్ బజ్‌ను కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో మేకర్స్ త్వరలోనే గ్లింప్స్ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

అసలు చరణ్ పుట్టినరోజుకే గ్లింప్స్ విడుదల చేయాలన్న మేకర్స్ ప్లాన్‌ను మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ ఆలస్యం చేయడంతో వెనక్కి వేశారు. గ్లింప్స్‌కు అవసరమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సమయానికి రాలేదు. అయితే బుచ్చిబాబు రెహమాన్‌ను ఫోర్స్ చేసి నాలుగు రోజుల్లో మ్యూజిక్ కంప్లీట్ చేయించాడని తెలుస్తోంది. అందుకే ఉగాది కానుకగా మార్చి 31న 'పెద్ది గ్లింప్స్' విడుదల కాబోతోంది. గ్లింప్స్ నిడివి 20 సెకన్లే అయినా… మాస్, మ్యూజిక్ కలబోతగా ఉంటుందని టీం టాక్. ఇదే గ్లింప్స్ నెగటివిటీని వాష్ అవుట్ చేయబోతోందని నమ్మకంగా ఉన్నారు.

ఈసారి చరణ్ మాస్ అప్పీల్‌తోనే కాకుండా, లోతైన ఎమోషనల్ పాత్రతో కనిపించనున్నాడని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో ఓ రఫ్ అండ్ రా క్యారెక్టర్‌ను ఆయన పోషించనున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు కథలు, క్యారెక్టరైజేషన్ విషయంలో తనదైన మార్క్ చూపిన డైరెక్టర్ కావడంతో, చరణ్ పాత్రను విభిన్నంగా ప్రెజెంట్ చేయబోతున్నాడనే అంచనాలు బలంగా ఉన్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్ కూడా కీలకంగా ఉండనుంది.

మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పుడు విడుదలవుతున్న గ్లింప్స్ ఈ సినిమాపై కొత్త హైప్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది ఉగాది రోజే తేలనుంది. కానీ టీం గ్లింప్స్ పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఒకవేళ ఇది బాగా ఆకట్టుకుంటే, 'పెద్ది'పై పాజిటివ్ బజ్ మళ్లీ మొదలవుతుంది.