Begin typing your search above and press return to search.

RC16: పెద్ది ఫైర్ మొదలైంది.. మాస్ లుక్‌తో చరణ్ డబుల్ థ్రిల్!

టైటిల్‌తో పాటు వచ్చిన చరణ్ లుక్స్ చూస్తే ఊరమాస్ అనే మాట చిన్నగా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   27 March 2025 4:52 AM
Charan Peddi look out
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC16 ప్రాజెక్ట్ నుంచి మోస్ట్ అవైటెడ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు స్పష్టమైంది. గత కొంతకాలంగా ఈ పేరే చర్చల్లో ఉండగా, తాజా పోస్టర్లతో అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు వచ్చిన చరణ్ లుక్స్ చూస్తే ఊరమాస్ అనే మాట చిన్నగా కనిపిస్తోంది.


రెండు పోస్టర్లు వచ్చినా ఒక్కోటి ఒక్కో వైబ్స్‌ను పుట్టిస్తున్నాయి. మొదటి పోస్టర్‌లో చరణ్ ముదురు గడ్డంతో, కళ్లలో మాస్ ఫైర్‌తో, సిగారెట్‌ను వెలిగించే శైలిలో చూస్తే.. ఈ పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ అంతుచిక్కని స్థాయిలో ఉందనిపిస్తుంది. ఇక రెండో పోస్టర్‌లో చరణ్ చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని నిలిచిన విధానం, వెనుక గ్రామీణ వాతావరణం, ఎక్కడో ఓ పల్లెటూరి జాతర అనిపించే అంబియెన్స్ ఇవన్నీ కలిస్తే… ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఓ మాస్ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు.


ఈ సినిమా కథ స్పోర్ట్స్, ముఖ్యంగా క్రికెట్ చుట్టూ తిరిగేలా ఉండబోతోందని తెలుస్తోంది. కానీ అది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాదన్నదే టాక్. మాస్ ఎలిమెంట్స్, గ్రామీణ వాతావరణం, లోతైన ఎమోషనల్ లేయర్లు ఈ సినిమాకు బలం కావనున్నాయి. ‘ఉప్పెన’తో బిగ్ హిట్ అందుకున్న బుచిబాబు, ఇప్పుడు చరణ్ క్యారెక్టర్‌ను మరో స్థాయిలో తీసుకెళ్లేలా డిజైన్ చేసినట్టు పోస్టర్ల ద్వారానే అర్థమవుతోంది. చరణ్ క్యారెక్టర్‌లో రఫ్‌నెస్, రెబెల్ టోన్ స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు, ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. మాస్ క్యారెక్టరైజేషన్‌తో పాటు ఎమోషనల్ బ్యాగ్రౌండ్ స్కోర్ బలంగా ఉండేలా రెహ్మాన్ టచ్ ఉంటుందన్న అంచనాలు పుట్టాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. విజువల్స్ విషయంలోనూ సినిమా మరో స్థాయిలో ఉండనుందని స్పష్టమవుతోంది.

మొత్తానికి టైటిల్ పోస్టర్‌తోనే "పెద్ది" సినిమా పట్ల అంచనాలు రెట్టింపు అయ్యాయి. చరణ్ లుక్, కంటెంట్‌పై చూపిన డిఫరెంట్ ప్యాకేజింగ్‌తో ఇది కచ్చితంగా మాస్ ప్రేక్షకులకు పండగ కావొచ్చని అభిమానులు నమ్ముతున్నారు. రఫ్ అండ్ రా అటిట్యూడ్‌తో, నెవ్వర్ బిఫోర్ లుక్‌లో చరణ్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎలా డెలివర్ చేస్తాడో చూడాలి. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.