Begin typing your search above and press return to search.

పెద్ది ఫస్ట్ షాట్ టీజర్ టాక్: విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్ మాస్ ధమాకా!

టీజర్ ప్రారంభం నుంచి చివరి వరకూ గ్రామీణ నేపథ్యంలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.

By:  Tupaki Desk   |   6 April 2025 6:37 AM
పెద్ది ఫస్ట్ షాట్ టీజర్ టాక్: విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్ మాస్ ధమాకా!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి మరో మాస్ ప్యాకేజి రాబోతోందనే సంకేతాలను ‘పెద్ది’ ఫస్ట్ షాట్ టీజర్ స్పష్టంగా ఇస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో ప్రేక్షకులను ఫుల్ ఎగ్జైట్ చేసింది. విలేజ్ అట్మాస్ఫియర్, బోల్డ్ మేకోవర్, స్పోర్ట్స్ యాంగిల్‌తో చరణ్ ఈసారి విభిన్నమైన స్టైల్‌లో కనిపించనున్నాడు.

టీజర్ ప్రారంభం నుంచి చివరి వరకూ గ్రామీణ నేపథ్యంలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. బియ్యపు పొలాల్లో పరుగులు తీస్తూ, క్రికెట్ మైదానంలో బంతిని స్టైలిష్‌గా ఔట్ ఆఫ్ ది పార్క్ కొడుతూ కనిపించే చరణ్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కళ్లలో పొగరు, చేతుల్లో పవరుతో చరణ్ పాత్రకు జీవం పోశాడని చెప్పాలి.

బుచ్చిబాబు సనా ఈ చిత్రాన్ని ప్రతీ ఫ్రేమ్ ఓ పెయింటింగ్‌లా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ నటనలో బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ, స్పోర్ట్స్ యాంగిల్ అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండేలా డిజైన్ చేసినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. క్రికెట్ నేపథ్యం ఉన్న కథలో చరణ్ ఓ క్లాస్ అండ్ మాస్ పర్‌ఫార్మెన్స్ అందించనున్నాడన్న ఆశలు టీజర్ తో పెరిగిపోయాయి.

విజువల్స్ పరంగా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే వైరల్ అవుతుండగా, టెక్నికల్ టీమ్ ప్రతి విజువల్‌ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో అందించేందుకు శ్రమిస్తోంది. బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌కు ఇది ఓ విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. ముఖ్యంగా టీజర్ లోని లాస్ట్ షాట్ కిర్రాక్ అనేలా ఉంది.

ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ప్రెజెంట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా 2026 మార్చి 27 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఒటమిని ఒప్పుకోని ఓ విలేజ్ యూత్ కథగా ముందుకు సాగుతున్న "పెద్ది" సినిమా టీజర్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. చరణ్ కొత్త లుక్, ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్, స్పోర్ట్స్ యాంగిల్.. ఇలాంటి అంశాలతో ఇది మాస్, క్లాస్, క్రేజీ కాంబినేషన్‌తో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ అనిపిస్తోంది. చూస్తుంటే పెద్ది ఏదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది.