Begin typing your search above and press return to search.

RC16: అప్పుడే సౌండ్ మొదలైంది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   5 Sep 2024 9:30 PM GMT
RC16: అప్పుడే సౌండ్ మొదలైంది
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాతో కిలారు వెంకట సతీష్ నిర్మాతగా పరిచయం అవుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకి సంబందించిన సెట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం మేకోవర్ అవ్వాల్సి ఉంది.

ఆ లుక్ లోకి రాగానే మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి బుచ్చిబాబు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత ఏ ఆర్ రెహమాన్ మరల తెలుగులో RC16 మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయిపోయాయి. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

ఇందులో రామ్ చరణ్ కామెడీ కూడా చేస్తాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. దీనిని బట్టి ఇది వరకు ఎన్నడూ చేయనటువంటి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో రామ్ చరణ్ RC16లో కనిపించబోతున్నాడని అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో గత కొంతకాలంలో ఇంటరెస్టింగ్ చర్చ నడుస్తోంది. RC16 మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ తో పాటు బుచ్చిబాబు సానా రైటింగ్, డైరెక్షన్, రెహమాన్ మ్యూజిక్ గురించి గట్టిగా మాట్లాడుకోవడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు.

రంగస్థలంకి మించి ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఉండబోతోందని మాట్లాడుకుంటున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ కావడంతో అక్కడి మాండలికంలోనే రామ్ చరణ్ క్యారెక్టర్ మాట్లాడుతుందంట. అలాగే సినిమాలో బుచ్చిబాబు అద్భుతమైన డైలాగ్స్ రాశారంట. మొదటి సినిమా ఉప్పెనకి రెండింతలు ఎఫెక్టివ్ గా RC16 మూవీ ఉంటుందంట. ఇప్పటికే ఈ చిత్రం కోసం రెహమాన్ మూడు సాంగ్స్ కూడా ఇచ్చారంట.

అతని నుంచి బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎక్కువగా దీని గురించే సౌండ్ వినిపిస్తోందంట. ఓవరాల్ గా ఈ సినిమా అయితే రామ్ చరణ్ కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని సినీ విశ్లేషకులు సైతం అంటున్నారు. పెద్ది అనే టైటిల్ ని ఈ సినిమాకి ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే అప్డేట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.