# ఆర్సీ 16 ఆట రసవత్తరంగా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Feb 2025 6:24 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దీనిలో భాగంగా రామ్ చరణ్ - దివ్యేందులపై క్రికెట్ నేపథ్యంగల సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ అంతా నైట్ మాత్రమే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆటకు సంబంధించిన సన్నివేశాలకు అదే అనుకూలమైన సమయం కావడంతో బుచ్చిబాబు నైట్ బ్యాక్ డ్రాప్ లోనే షూట్ చేస్తున్నారు.
సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. క్రికెట్ తో పాటు కుస్తీ ఆట కూడా ఉంటుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా లీకైంది. కుస్తీతో పాటు మరికొన్ని ఆటలు కూడా సినిమాలో కీలకం కానున్నాయని సమాచారం. ఈ ఆటలన్నింటి నేపథ్యంలో బలమైన భావోద్వేగాలు నిండిన రా అండ్ రస్టిక్ కథగా హైలైట్ అవుతుందని అంటున్నారు.
తాజా షెడ్యూల్ అనంతరం తదుపరి మొదలయ్యే కొత్త షెడ్యూ ల్ లో కుస్తీ ఆటకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. ఇవి కూడా రాత్రిపూట సాగే సన్నివేశాలుట. అంటే తదుపరి షెడ్యూల్ కూడా రాత్రిపూటే ఉంటుందని తెలుస్తోంది. కుస్తీకు సంబంధించి తాజా సెట్ లోనే ప్రత్యేకంగా ఇసుక తో కూడిన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారుట.
మొత్తానికి ఇక్కడ హైలైట్ అవుతున్న విషయం ఏంటంటే? ఇప్పటి వరకూ క్రికెట్..కుస్తీ ఆటల మాత్రమే అనుకున్నారంతా. కానీ ఇంకా చాలా ఆటలు కథలో కనిపిస్తాయనే ప్రచారం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో బుచ్చిబాబు కథలో సారాంశాన్ని ఎలా ముగిస్తాడు? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.