RC16 : చరణ్, జాన్వీ లేట్ నైట్ కష్టాలు!
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తున్నారు. RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ బ్రేక్ ఇవ్వకుండా రెగ్యులర్‌గా చేస్తున్నారు.
By: Tupaki Desk | 11 March 2025 3:29 PM ISTరామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తున్నారు. RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ బ్రేక్ ఇవ్వకుండా రెగ్యులర్‌గా చేస్తున్నారు. ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు బుచ్చిబాబు వర్క్ చేస్తున్నాడు అని సమాచారం అందుతోంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బుచ్చిబాబు దాదాపు ఏడాది కాలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి షూటింగ్ మొదలు పెట్టాడు. స్క్రిప్ట్ విషయంలో చాలా శ్రద్ద తీసుకున్న బుచ్చిబాబు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
గత కొన్ని రోజులుగా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే శివరాజ్ కుమార్ లుక్ టెస్ట్‌ను సైతం బుచ్చిబాబు పూర్తి చేశారు. లుక్ టెస్ట్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. కేన్సర్‌ను జయించిన శివ రాజ్ కుమార్ మొదటగా ఈ సినిమా షూటింగ్‌లోనే పాల్గొనబోతున్నాడు అంటూ కన్నడ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే శివ రాజ్ కుమార్ RC16 సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నట్లు వార్తలు రాలేదు. మరో వైపు సినిమా కోసం కీలకమైన సన్నివేశాలను నైట్ టైమ్‌లో షూట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి నైట్ షూట్‌ను బుచ్చిబాబు మొదలు పెట్టాడని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
నైట్ షూట్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మొదట జాన్వీ కపూర్‌పై నైట్ షాట్స్ షూట్ చేస్తున్నారట. తాజాగా నైట్ మొత్తం జాన్వీ కపూర్‌పై షాట్స్ తీశారని, ఆమె కాంబోలో ఉన్న సీన్స్‌ను పూర్తి చేయడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని టాక్ వినిపిస్తుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నైట్ ఎఫెక్ట్‌లో షూటింగ్‌ని బుచ్చిబాబు ప్లాన్ చేశాడు. సాధారణంగా లేట్ నైట్‌లో వర్క్ చేయాలంటే ఎవరికైనా కష్టం. అలాంటిది లేట్ నైట్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ షూటింగ్‌లో పాల్గొనడం అనేది కాస్త కష్టమైన విషయమే. డే టైమ్‌లో తీసి నైట్ ఎఫెక్ట్ ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. కానీ బుచ్చిబాబు మాత్రం నైట్ టైమ్‌లోనే తీయాలనే పట్టుదలతో చరణ్, జాన్వీని కష్టపెడుతున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ కామెంట్ చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమాతో రామ్ చరణ్ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో వచ్చిన పాన్ ఇండియా స్టార్‌డంను కాపాడుకోవడం కోసం చరణ్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గురువు సుకుమార్‌కి తగ్గ శిష్యుడు అంటూ బుచ్చిబాబు ఇప్పటికే నిరూపించుకున్నాడు. కనుక RC16తో మరోసారి తన సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న RC16 సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీపై ఉన్న అంచనాలను అందుకునే విధంగా రొమాంటిక్ లవ్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.