Begin typing your search above and press return to search.

అక్టోబ‌ర్ నుంచి చ‌ర‌ణ్ ఆట ఆరంభం!

ఆర్సీ 16కి రామ్ చ‌ర‌ణ్ రెడీ అవుతున్నాడా? లుక్ ప‌రంగానూ భారీ మార్పులు తీసుకొస్తున్నాడా? స‌రికొత్త మేకోవ‌ర్ లో అల‌రించ‌నున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   1 Sep 2024 1:30 PM GMT
అక్టోబ‌ర్ నుంచి చ‌ర‌ణ్ ఆట ఆరంభం!
X

ఆర్సీ 16కి రామ్ చ‌ర‌ణ్ రెడీ అవుతున్నాడా? లుక్ ప‌రంగానూ భారీ మార్పులు తీసుకొస్తున్నాడా? స‌రికొత్త మేకోవ‌ర్ లో అల‌రించ‌నున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇటీవ‌లే గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ నుంచి చ‌ర‌ణ్ రిలీవ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి డ‌బ్బింగ్ ప‌నులు ఒక్క‌టే పెండింగ్. అది పూర్తి కూడా పూర్తి చేసేస్తే డిసెంబ‌ర్ వ‌ర‌కూ మ‌ళ్లీ చ‌ర‌ణ్ అవ‌స‌రం శంక‌ర్ కి ఉండ‌దు.

అయితే అదేం ఇబ్బంది కాదు. ఓ ప‌ది రోజుల పాటు డ‌బ్బింగ్ కి హాజ‌రైతే స‌రిపోతుంది. దీంతో చ‌ర‌ణ్ అక్టోబ‌ర్ నుంచి బుచ్చిబాబు సినిమా షూట్ లో జాయిన్ అవుతాడు. అప్ప‌టి నుంచి నిర‌వ‌ధికంగా షూటింగ్ చేసుకునేలా టీమ్ అంతా రెడీ గా ఉండాల‌ని ఆదేశాలిచ్చాడుట‌. ఈసినిమాలో చ‌ర‌ణ్ కొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడుట‌. అందుకోసం మ‌ళ్లీ జిమ్ములో టైమ్ పెంచిన‌ట్లు స‌మాచారం. రెగ్యుల‌ర్ స‌మ‌యం కంటే మ‌రికొన్ని గంట‌లు అధికంగా క‌ష్ట‌ప‌డుతున్నాడుట‌.

స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓపిరియాడిక్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఇది ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ స్టోరీ కాద‌ని..బుచ్చిబాబు ఓ 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లి రాసుకున్న క్రీడా నేప‌థ్యంగల క‌థ అంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్టు చ‌ర‌ణ్ లుక్ ప‌రంగా చాలా మార్పులు అవ‌స‌ర‌మ‌ని సూచించ‌డంతో చ‌ర‌ణ్ ఆ ప‌నిలో ఉన్నాడుట‌. అయితే బుచ్చిబాబు ఎంపిక చేసుకున్న ఆ క్రీడ మాత్రం సస్పెన్స్.

నేరుగా థియేట‌ర్లో చూసి తెలుసుకోవాల్సిందే త‌ప్ప అంత‌వ‌ర‌కూ ఎలాంటి అధికారిక స‌మాచారం ఉండ‌దు. ఇందులో చ‌ర‌ణ్ కి జోడీగా జాన్వీ క‌పూర్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జాన్వీ మాత్రం నవంబ‌ర్ నుంచి సెట్స్ కి హాజ‌ర‌వుతుంద‌ని స‌మాచారం. ఈ గ్యాప్ లో అమ్మ‌డు బాలీవుడ్ లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ల్లో బిజీగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో అమ్మ‌డు `దేవ‌ర‌`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంది.