శంకర్ తో కష్టం..కానీ పనిచేస్తే లాభం! రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Dec 2024 11:04 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్యాచ్ వర్క్ జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతు న్నాయి. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా ఓ మీట్ లో ఈ ప్రాజెక్ట్ ఎలా పట్టాలెక్కిందన్నది చరణ్ వివరించాడు.
`ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ లో ఉన్న సమయంలో శంకర్ నుంచి నేరుగా రామ్ చరణ్‌కి ఫోన్ వచ్చిందిట. ఆ ఒక్క ఫోన్ కాల్ తో చరణ్ సినిమా చేయాలని ఫిక్సైపోయారుట. ఆయన నుంచి ఫోన్ కాల్ రావడమే కష్టం. అలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారని వెంటనే చెప్పారుట. ఆ సమయంలో ఇంకే విషయం ఆలోచించలేదన్నారు. ఆ ఫోన్ కాల్ ని ఓ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పనిచేయడం కాస్త కష్టంగా ఉన్నా? పనిచేస్తే మాత్రం చాలా లాభాలుంటాయన్నారు.
అలాగే సినిమాలో తండ్రి...కుమారుడు రోల్ తానే పోషిస్తున్నట్లు తెలిపారు. ఒకటి రైతు పాత్ర కాగా, మరొకటి ప్రభుత్వ అధికరి రోల్ అని తెలిపారు. దీంతో చరణ్ రెండు పాత్రలపైనా రిలీజ్ కు ముందే క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఆ పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ మెలాడీ సాంగు ఇంటర్నెట్ ని ఊపేస్తుంది. ఇంకా మరికొన్ని పాటలు రిలీజ్ కావాల్సి ఉంది.
ట్రైలర్ కోసం అభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇంతవరకూ శంకర్ తెలుగు సినిమాగానీ, తెలుగు హీరోని కానీ డైరెక్ట్ చేయలేదు. తొలిసారి ఆ ఛాన్స్ కేవలం రామ్ చరణ్ కి మాత్రమే వచ్చింది. అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ కి ఆ ఛాన్స్ వచ్చింది కానీ...అది రీమేక్ సినిమా కావడంతో మహేష్ అంగీకరించలేదు.