Begin typing your search above and press return to search.

చావైనా బ‌తుకైనా ఇండ‌స్ట్రీలో! రామ్ చర‌ణ్‌

మెగాస్టార్ చిరంజీవి వార‌స‌త్వంతో రామ్ చ‌ర‌ణ్ తెరంగేట్రం చేసి నేడు గ్లోబ‌ల్ స్టార్ గా నీరాజ‌నాలు అందుకుటు న్నాడు.

By:  Tupaki Desk   |   12 Jan 2025 2:18 PM GMT
చావైనా బ‌తుకైనా ఇండ‌స్ట్రీలో!  రామ్ చర‌ణ్‌
X

మెగాస్టార్ చిరంజీవి వార‌స‌త్వంతో రామ్ చ‌ర‌ణ్ తెరంగేట్రం చేసి నేడు గ్లోబ‌ల్ స్టార్ గా నీరాజ‌నాలు అందుకుటు న్నాడు. తండ్రి పెద్ద స్టార్ అయినా ? ఆ ఇమేజ్ ఎక్క‌డా త‌నపై ప‌డ‌కుండా త‌న‌ని తాను స్టార్ గా తీర్చిదిద్దుకున్నాడు. అందుకోసం చ‌ర‌ణ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. కెరీర్ లో అంచ‌లంచెలుగా ఎదిగాడు. నేడు చ‌ర‌ణ్ ఇమేజ్ పాన్ ఇండియాని దాటి గ్లోబ‌ల్ స్థాయికి చేరింది.

మ‌రి అలాంటి చ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీకి రాక‌పోయి ఉంటే? ఎలా ఉండేది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ విష‌యాన్ని న‌ట‌సింహ బాల‌కృష్ణ అన్ స్టాప‌బుల్ షోలో నేరుగా చ‌ర‌ణ్ నే అడిగారు. అందుకు చ‌ర‌ణ్ చెప్పిన స‌మాధానం తెలిస్తే సినిమాల్ని ఎంత‌గా ప్రేమించాడు అన్న‌ది అర్ద‌మ‌వుతుంది. చావైనా బ్ర‌తుకైనా ఇండ‌స్ట్రీలోనేన‌ని ఒక్క ముక్క‌తో తాను ఎంత‌గా సినిమాల్ని ఆరాదిస్తున్నాడు అన్న‌ది అర్ద‌మైంది. చ‌ర‌ణ్ చిన్న నాటి నుంచి సినిమా వాతావ‌ర‌ణంలోనే పెరిగాడు.

కానీ ఆ ప్ర‌భావం చ‌ర‌ణ్ పై ప‌డ‌కుండా మాత్రం చిరంజీవి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. చిన్న వ‌య‌సులో చ‌ర‌ణ్ ని సినిమా షూటింగ్ ల‌కు చిరంజీవి పెద్ద‌గా తీసుకెళ్లే వారు కాదు. చాలా అరుదుగానే అలాంటి స‌న్నివేశాలు చోటు చేసుకునేవి. చ‌ర‌ణ్ కి షూటింగ్ చూడాల‌ని మ‌న‌సులో ఉన్నా? తండ్రికి భ‌య‌ప‌డి అడిగేవారు కాదు. కానీ నేడు తండ్రినే మించిన త‌న‌యుడిగా ఎదిగారు. షూటింగ్ ల పేరుతో ప్ర‌పంచంలో ఉన్న అందాల‌న్నీంటిని ఆస్వాది స్తున్నాడు.

ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `గేమ్ ఛేంజ‌ర్` భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ 16వ చిత్రం సెట్స్ లో ఉంది. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసారు. త‌దుప‌రి షెడ్యూల్ కు రామ్ చ‌ర‌ణ్ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.