మెగా పవర్ స్టార్ మార్చ్ బెటర్ అంటున్నాడా?
ప్రస్తుతం అతడి టార్గెట్ అంతా పాన్ ఇండియాలో నిలదొక్కుకోవడంపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు.
By: Tupaki Desk | 24 March 2025 4:00 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మార్చి రిలీజ్ సెంటిమెంట్ గా కలిసొచ్చిందా? అందుకే ఆర్సీ 16 కూడా మార్చికి లాక్ చేసారా? అంటే అలాగే అనిపిస్తుంది. రామ్ చరణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా 'ఆర్ ఆర్ ఆర్' మార్చిలోనే రిలీజ్ అయింది. ఈ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఒక్క సక్సెస్ అతడి క్రేజ్ ని ఏకంగా పాన్ ఇండియానే దాటించేసింది. 1000 కోట్ల వసూళ్ల స్టార్ గా మార్చేసింది.
ప్రస్తుతం అతడి టార్గెట్ అంతా పాన్ ఇండియాలో నిలదొక్కుకోవడంపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు. అంతకు ముందు చరణ్ నటించని మరో చిత్రం 'రంగస్థలం' కూడా మార్చిలోనే రిలీజ్ అయింది. ఈ సినిమాతో చరణ్ నటుడిగా మరో మెట్టు పెకి ఎక్కాడు. ఈ సినిమా ఏకంగా చరణ్ ని 200 కోట్ల క్లబ్ లో కూర్చె బెట్టింది. 'రంగస్థలం' ముందు వరకూ చరణ్ కెరీర్ లో భారీ వసూళ్ల చిత్రం 'రంగస్థలమే'.
అలా మార్చి రిలీజ్ లు రెండు చరణ్ కి ఎంతగానో కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్సీ 16, ఆర్సీ 17 రిలీజ్ ప్లానింగ్ కూడా అలాగే ఉంది. ప్రస్తుతం చరణ్ 16వ చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సెట్స్ లో ఉందీ ఈ చిత్రం. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మార్చిలో రిలీజ్ చేస్తే బాగుంటుందని చరణ్ దర్శక, నిర్మాతలకు సూచించడంతోనే ఆ నెలకు ఫిక్స్ అయినట్లు వినిపిస్తుంది.
అలాగే సుకుమార్ దర్శకత్వంలో తన 17వ చిత్రం కూడా తెరకెక్కించాల్సి ఉంది. బుచ్చిబాబు షూటింగ్ పూర్తి చేయగానే సుకుమార్ రంగంలోకి దిగుతాడు. అయితే ఆర్సీ 16 తర్వాత చరణ్ కొంత గ్యాప్ తీసుకుంటాడు. ఆ గ్యాప్ ఆర్సీ 16 రిలీజ్ వరకూ తీసుకుంటే? గనుక 2027లోనే సుకుమార్ సినిమా రిలీజ్ అవుతుంది. అలా కాకుండా బుచ్చిబాబు సినిమా షూటింగ్ సగం పూర్తయిన తర్వాత సెట్స్ కి తీసుకెళ్తే? 2026లోనే రిలీజ్ అవుతుంది. అలాగైతే మార్చి కి రిలీజ్ చేయడం అన్నది సాధ్యపడదు.