Begin typing your search above and press return to search.

జక్కన్న.. తారక్ ను చరణ్ ఫాలో అవుతారా?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. రీసెంట్ గా దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన

By:  Tupaki Desk   |   4 Oct 2024 11:17 AM GMT
జక్కన్న.. తారక్ ను చరణ్ ఫాలో అవుతారా?
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. రీసెంట్ గా దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా.. మంచి టాక్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు రూ.405 కోట్లు రాబట్టేసింది. దీంతో దేవర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుందని వార్తలు వస్తున్నాయి. దసరా సెలవుల్లో వచ్చిన వసూళ్లంతా లాభాలేనని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

అయితే దేవరతో మంచి హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఓ మిథ్ ను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత నటించే నెక్స్ట్ మూవీ డిజాస్టర్ గా మారుతుందనే సెంటిమెంట్ కొన్నేళ్లుగా టాలీవుడ్ లో ఉంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఫేస్ చేశారు. చివరగా రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ లో నటించిన ఆయన.. ఇప్పుడు దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఫేమస్ మిథ్ ను బ్రేక్ చేశారు.

చెప్పాలంటే జక్కన్న మీద ఉన్న అపవాదును పూర్తిగా తొలగించేశారు! దేవర రిలీజ్ అయ్యాక రాజమౌళి కుమారుడు కార్తికేయ అదే విషయాన్ని ట్వీట్ లో ప్రస్తావించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఆర్ఆర్ఆర్ కోసం తొలిసారి రాజమౌళితో స్టార్ హీరో రామ్ చరణ్ వర్క్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో మరికొద్ది రోజుల్లో సోలోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మధ్యలో ఆచార్య మూవీ చేసినా.. అది డిజాస్టర్ గా మారింది.

ఇప్పుడు సోలోగా చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో క్రిస్మస్ సమయంలో వస్తున్నారు. దీంతో చరణ్ కూడా మంచి హిట్ కొట్టి.. రాజమౌళి మిథ్ ను మరోసారి బ్రేక్ చేయాలని ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ లో తన కో-యాక్టర్ తారక్ దేవరతో మంచి హిట్ అందుకున్నారని.. ఇప్పుడు చరణ్ కూడా అలాంటి విజయమే అందుకోవాలని కోరుకుంటున్నారు. భీమ్ గెలిచేశారని.. ఇప్పుడు రామ్ కూడా గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెబుతున్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.. మరోవైపు షూటింగ్ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో అన్ని పనులు పూర్తి చేయనున్నారు మేకర్స్. రీసెంట్ గా రా మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. దసరా కానుకగా టీజర్ ను విడుదల చేయనున్నారు. మరి గేమ్ ఛేంజర్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో? చరణ్ కూడా రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారో లేదో వేచి చూడాలి.