Begin typing your search above and press return to search.

చరణ్‌ స్వామి ఇరుముడితో శబరిమల వెళ్లడం లేదా?

తెలుగు రాష్ట్రాల్లో నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలల్లో ఎక్కువగా అయ్యప్ప మాల ధారణ స్వాములు కనిపిస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   17 Dec 2024 6:58 AM GMT
చరణ్‌ స్వామి ఇరుముడితో శబరిమల వెళ్లడం లేదా?
X

తెలుగు రాష్ట్రాల్లో నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలల్లో ఎక్కువగా అయ్యప్ప మాల ధారణ స్వాములు కనిపిస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు అయ్యప్ప మాలధారణ చేయడం మనం చూస్తూ ఉంటాం. గతంలో చిరంజీవి రెగ్యులర్‌గా అయ్యప్ప మాల వేసేవారు. కానీ ఇప్పుడు ఆ ఆనవాయితీని రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా, ఏ సినిమాల్లో నటిస్తున్నా, విదేశాల్లో ఉన్నా రామ్‌ చరణ్ అయ్యప్ప మాల ధరించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈసారి చరణ్ మాలలో ఉన్నారు. ఇటీవల బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో కనిపించిన చరణ్ అయ్యప్ప మాలలోనే ఉన్న విషయం తెల్సిందే.

అయ్యప్ప మాల ధరించి ఉన్న రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా యూఎస్‌ఏ కి వెళ్లబోతున్నారు. డల్లాస్‌లో జరగబోతున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి యూనిట్‌ సభ్యులతో కలిసి యూఎస్‌ ఫ్లైట్‌ ఎక్కబోతున్నారు. మాలలోనే చరణ్ యూఎస్‌ వెళ్లబోతున్నారు. అయితే వచ్చేప్పుడు మాత్రం ఆయన అయ్యప్ప మాల లేకుండా రాబోతున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్‌ డల్లాస్‌లోని అయ్యప్ప స్వామి గుడిలో మాల విసర్జన చేయబోతున్నాడు. మాల విసర్జన తర్వాత చరణ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంటారు అంటూ అక్కడి వారి నుంచి సమాచారం అందుతోంది.

రెగ్యులర్‌గా అయ్యప్ప మాల వేసే రామ్‌ చరణ్ చాలా అరుదుగా మాత్రమే కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెళ్తారు. సాధారణంగా అయ్యప్ప భక్తులు ఎక్కువ శాతం మంది శబరిమల వెళ్లి మాల విసర్జన చేస్తారు. కానీ చరణ్‌తో పాటు కొందరు సెలబ్రిటీలు మాత్రం తమకు వీలున్న చోట మాల విసర్జన చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈసారి రామ్‌ చరణ్ అయ్యప్ప మాల విసర్జన డల్లాస్‌లోని దేవాలయంలో చేయబోతున్నారు. మాల విసర్జన ఎక్కడ చేసినా చరణ్‌ యొక్క అయ్యప్ప స్వామి భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈతరం వారు అయ్యప్ప స్వామి మాల ధరించడం అది కూడా ఒక స్టార్‌ సెలబ్రిటీ అయ్యి ఉండి ఎన్నో పనులు ఉంటాయి, వాటన్నింటిని మేనేజ్ చేస్తూ మాలలో కొనసాగడం అనేది మామూలు విషయం కాదు.

రామ్‌ చరణ్‌ డ్యూయెల్‌ రోల్‌లో నటించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించాడు. శంకర్‌ వింటేజ్‌ సినిమాలను చూసినట్లుగా గేమ్‌ ఛేంజర్ ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ కనిపించబోతుంది. తండ్రి చరణ్ పాత్రకి గాను అంజలి నటించింది. శ్రీకాంత్‌, ఎస్‌ జే సూర్యలు పోషించిన పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయని అంటున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను భారీగా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే డల్లాస్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు.