గ్లోబల్ స్టార్ ఊహించని కాంబో..!
ఐతే ఈ రెండు సినిమాలకే దాదాపు 4 ఏళ్లు టైం పట్టేలా ఉండగా లేటెస్ట్ గా రామ్ చరణ్ తో నాని డైరెక్టర్ సినిమా ఉండబోతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 11 Feb 2025 1:07 PM GMTగ్లోబల్ స్టార్ రాం చరణ్ గేమ్ ఛేంజర్ తర్వాత తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు తో చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చరణ్ 16వ సినిమా పీరియాడికల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. బుచ్చి బాబు సినిమా తర్వాత చరణ్ సుకుమార్ తో మరో సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. ఐతే ఈ రెండు సినిమాలకే దాదాపు 4 ఏళ్లు టైం పట్టేలా ఉండగా లేటెస్ట్ గా రామ్ చరణ్ తో నాని డైరెక్టర్ సినిమా ఉండబోతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాను డైరెక్ట్ చేశాడు నూతన దర్శకుడు శౌర్యువ్. ఆ సినిమా అతను హ్యాండిల్ చేసిన తీరుకి ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది కాబట్టి శౌర్యువ్ కి భారీ ఆఫర్లు వచ్చాయి. ఐతే అతను మాత్రం తన నెక్స్ట్ సినిమా చరణ్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ కి కథ చెప్పడం మెగా హీరో తన ఇంట్రెస్ట్ ని చూపించడం జరిగిందట.
ఐతే బుచ్చి బాబు సినిమా ఎలా లేదన్నా దాదాపు మరో ఏడాది పట్టేలా ఉంది. ఆ నెక్స్ట్ సుకుమార్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. మరి శౌర్యువ్ సినిమా ఎప్పుడు ఉంటుందా అన్న డౌట్ మొదలైంది. ఐతే బుచ్చి బాబు సినిమా పూర్తి కాగానే సుకుమార్ సినిమా మొదలయ్యే గ్యాప్ లో ఈ మూవీ పూర్తి చేస్తాడేమో అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా శౌర్యువ్ తో చరణ్ సినిమా అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదని చెప్పొచ్చు.
ఇంతకీ ఒక సినిమా అనుభవం ఉన్న శౌర్యువ్ ఎలాంటి కథ చెబితే చరణ్ ఒప్పుకున్నాడు అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది అయితే కంప్లీట్ స్టోరీ ఇంకా చెప్పాలి చిన్న లైన్ మాత్రమే రామ్ చరణ్ విని ఇంట్రెస్ట్ చూపించారు అంట..కంప్లీట్ స్టోరీ వినిపించి బౌండ్ర్ స్క్రిప్ట్ తో వస్తే అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు . ఉప్పెన తో హిట్ కొట్టిన డైరెక్టర్ గా బుచ్చి బాబు కూడా ఒక సినిమా అనుభవమే ఉంది ఐతే అతను సుకుమార్ శిష్యుడు కాబట్టి అతని మీద నమ్మకం ఉంచాడు చరణ్. ఐతే శౌర్యువ్ తో చరణ్ సినిమా అన్నది మెగా ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. మరి ఈ కాంబో సినిమా ఎప్పుడు మొదలవుతుంది. సినిమా గురించి ఏమైనా డీటైల్స్ అందిస్తారా అన్నది చూడాలి.