Begin typing your search above and press return to search.

ఆర్సీ16 కోసం చ‌ర‌ణ్ సాహ‌సం

దీంతో మెగా ఫ్యాన్స్ ఆశ‌ల‌న్నీ చ‌ర‌ణ్ తర్వాతి సినిమా పైనే పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Feb 2025 12:30 AM GMT
ఆర్సీ16 కోసం చ‌ర‌ణ్ సాహ‌సం
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చ‌ర‌ణ్ నుంచి రెండు సినిమాలు రిలీజ‌య్యాయి. అది ఒక‌టి ఆచార్య కాగా మ‌రొక‌టి గేమ్ ఛేంజ‌ర్. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగానే మిగిలాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆశ‌ల‌న్నీ చ‌ర‌ణ్ తర్వాతి సినిమా పైనే పెట్టుకున్నారు.

గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌న 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా కోసం చ‌ర‌ణ్ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయ‌ని, సినిమాకు ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా కీల‌క‌మ‌ని ఇప్ప‌టికే వార్త‌లొచ్చాయి.

ఈ నేప‌థ్యంలోనే చ‌ర‌ణ్ ఆ ఫ్లాష్ బ్యాక్ కోసం ఓ సాహ‌సం చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ స‌న్నివేశాల కోసం రామ్ చ‌ర‌ణ్ దాదాపు 10 కేజీల బ‌రువు త‌గ్గ‌నున్నాడ‌ట‌. ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం ప్ర‌కారం మొద‌టి పాత్రలో చ‌ర‌ణ్ కాస్త బ‌రువుతోనే క‌నిపిస్తాడ‌ని, ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం ఏకంగా 10 కిలోలు త‌గ్గి క‌నిపిస్తాడ‌ని అంటున్నారు.

ఇదే నిజ‌మైతే చ‌ర‌ణ్ ఈ సినిమా కోసం పెద్ద సాహ‌స‌మే చేస్తున్న‌ట్ట లెక్క‌. 10 కిలోల బ‌రువు త‌గ్గ‌డ‌మంటే మాట‌లు కాదు. ఈ సినిమాకు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ప్ప‌టికీ క‌థ ప‌రంగా సుకుమార్ హ్యాండ్ కూడా ఉండే ఛాన్సుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆడియ‌న్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే రెహ‌మాన్ మూడు ట్యూన్స్ ను కూడా రెడీ చేశాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఆర్సీ 16 త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్, త‌న‌కు రంగ‌స్థ‌లం లాంటి సూప‌ర్ హిట్ ను అందించిన సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు.