Begin typing your search above and press return to search.

RC 16 రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లేనా?

రీసెంట్ గా క్రికెట్‌ పవర్‌ అంటూ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇచ్చిన హింట్ అందరిలో ఆసక్తి నెలకొల్పింది.

By:  Tupaki Desk   |   19 Feb 2025 4:05 PM GMT
RC 16 రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లేనా?
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా (RC 16) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో మూవీ రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా క్రికెట్‌ పవర్‌ అంటూ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇచ్చిన హింట్ అందరిలో ఆసక్తి నెలకొల్పింది.

కొద్ది రోజుల క్రితం రెగ్యులర్ షూటింగ్ ను మేకర్స్ స్టార్ట్ చేయగా.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా.. RC 16పై అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో మూవీ 2025లోనే రిలీజ్ అవుతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు డేట్ ను కూడా మేకర్స్ లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 16వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీపావళి పండుగ అక్టోబర్ 20వ తేదీ కాగా.. ముందే సందడి మొదలుకానుంది!

RC 16 రిలీజ్ డేట్ పై త్వరలో మేకర్స్.. అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే దసరా స్పెషల్ గా మూవీ రిలీజ్ అవుతుందని తొలుత వార్తలు వచ్చినా.. ఇప్పుడు దీపావళి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం మీద సరైన డేట్ నే మేకర్స్ ఎంచుకున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.

అక్టోబర్ 16వ తేదీ గురువారం కాగా.. ఆ తర్వాత వీకెండ్ ఎప్పటిలానే కలిసి వస్తుంది.. ఆ తర్వాత దీపావళి సోమవారం.. దీంతో మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షమేనని చెప్పాలి. అదే సమయంలో బుచ్చిబాబు.. చరణ్ ను వేరే లెవెల్ లో ప్రెజెంట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి RC 16 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.