Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్‌కి పెళ్లి కుదిరింది..ఇదిగో ఇదే ప్రూఫ్‌!

అదంతా అటుంచితే ఇప్పుడు ప్ర‌భాస్ స్నేహితుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అస‌లు గుట్టు విప్పారు.

By:  Tupaki Desk   |   11 Jan 2025 4:14 AM GMT
ప్ర‌భాస్‌కి పెళ్లి కుదిరింది..ఇదిగో ఇదే ప్రూఫ్‌!
X

డార్లింగ్ ప్ర‌భాస్ పెళ్లి గురించి ఇంట్లో చాలా పోరు ఉంది. ప్ర‌భాస్ పెద‌నాన్న దివంగ‌త‌ రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు నుంచి చాలా ఒత్తిడి ఉండేది. కానీ ప్ర‌భాస్ దానిని దాట‌వేస్తూ వ‌చ్చాడు. బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియ‌న్ స్టార్ డ‌మ్ అందుకున్న క్ర‌మంలో అత‌డు ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు లేదా పారిశ్రామిక వేత్త కుమార్తెను పెళ్లాడ‌తాడ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగింది. కానీ అది కూడా నిజం కాలేదు. అయితే 45 సంవత్స‌రాల వ‌య‌సులోను ప్ర‌భాస్ పెళ్లి మాటెత్త‌డం లేదు. వీలున్న ప్ర‌తిసారీ మీడియాలతో శ్రీ‌మ‌తి శ్యామ‌లాదేవి(కృష్ణంరాజు స‌తీమ‌ణి)గారు కుమారుడు ప్ర‌భాస్ పెళ్లి గురించి ప్ర‌స్థావిస్తూనే ఉన్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ కి పెళ్ల‌వుతుంద‌ని ఆమె అనడం.. ఆ త‌ర్వాత అది కూడా జ‌ర‌గ‌క‌పోవడం అభిమానుల‌కు తెలిసిన వ్య‌వ‌హార‌మే.

అదంతా అటుంచితే ఇప్పుడు ప్ర‌భాస్ స్నేహితుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అస‌లు గుట్టు విప్పారు. అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 4 లో కనిపించిన రామ్ చరణ్ ప్ర‌భాస్ పెళ్లికి సంబంధించిన టాప్ సీక్రెట్ ని నిస్సంకోచంగా రివీల్ చేసారు. అత‌డు ఎన్బీకేతో చాటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్ కి పిల్లను వెతుకుతున్న విష‌యాన్ని ప్ర‌స్థావించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గణపవరంకి చెందిన‌ అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నాడని వెల్లడించారు.

స్వ‌యంగా స్నేహితుడే ఈ ప్ర‌క‌ట‌న చేసాడు కాబ‌ట్టి ఇప్పుడు న‌మ్మొచ్చు. ఇదే నిజ‌మైతే అభిమానుల‌కు శుభ‌వార్త అందిన‌ట్టే. అదే స‌మ‌యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భాస్ మ‌హిళా ఫ్యాన్స్ గుండెల్లో ముల్లు గుచ్చుకున్న‌ట్టే. బాహుబలి స్టార్ ప్ర‌భాస్ డేటింగుల గురించి ఎప్పుడూ ఉత్సాహం చూపించే హిందీ మీడియాకు కూడా ఇది కావాల్సినంత స‌రంజామాను అందిస్తుంది.

అస‌లు చ‌ర‌ణ్ చెప్పిన‌దాంట్లో నిజం ఎంత‌? అన్న‌ది తెలియాలంటే 14 జ‌న‌వ‌రి సంక్రాంతి రోజున ఆహాలో ప్రత్యేకంగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ని వీక్షించాల్సిందే. స‌ల్మాన్ ఖాన్ త‌ర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా ప్ర‌భాస్ గురించి దేశంలో గుస‌గుసలు వినిపిస్తున్నాయి. అందుకే అత‌డు ఈ ఏడాది అయినా అన్ని గాసిప్పుల‌కు చెక్ పెడ‌తాడ‌నే భావిద్దాం.