Begin typing your search above and press return to search.

అకిరా చెప్పబట్టే ఆ పని నేర్చుకున్న చరణ్..!

ఇందులో భాగంగానే ఇప్పటికే వెంకటేష్ ఈ షోకి అటెండ్ అవ్వగా లేతేస్ట్ గా రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 1:12 PM GMT
అకిరా చెప్పబట్టే ఆ పని నేర్చుకున్న చరణ్..!
X

గ్లోబల్ స్టార్ రాం చరణ్ లేటెస్ట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి వెళ్లారు. అన్ స్టాపబుల్ షో ఇప్పటివరకు 3 సీజన్లు పూర్తి చేసుకోగా ప్రస్తుతం సీజన్ 4 నడుస్తుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రాని సెలబ్రిటీస్ ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి రిలీజ్ ఉన్న స్టార్ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా వారిని తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే వెంకటేష్ ఈ షోకి అటెండ్ అవ్వగా లేతేస్ట్ గా రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు.

ఆహా అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్ రావడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఐతే ఈ ఇంటర్వ్యూలో చరణ్ తన పర్సనల్ ప్రొఫెషనల్ కి సంబందించిన విషయాలను బాలయ్య ని పంచుకున్నారు. ఈ క్రమంలో రాం చరణ్ తన సోదరుడు అకిరా నందన్ తో తన బంధం గురించి ప్రస్తావించారు. షోలో భాగంగా అకిరా నందన్ గురించి మాట్లాడిన చరణ్ అతను చాలా సైలెంట్ గా ఉంటాడని అన్నారు చరణ్. అంతేకాదు వాళ్ల నాన్న లానే చాలా పద్ధతిగా ఉంటాడని అన్నారు చరణ్.

అకిరా గురిచే చెబుతూ.. నాకు బుక్స్ చదవడం అంతగా ఇష్ట ఉండదు.. కానీ అకిరా మాత్రం తనకు బుక్స్ కానుకలుగా ఇస్తుంటాడు. ఐతే తను చేసిన ఈ అలవాటు వల్ల తాను ఇప్పుడు అతను ఇచ్చిన బుక్స్ ని చదువుతున్నానని అన్నారు రామ్ చరణ్.

బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే చరణ్ కి గొప్ప అభిమానం ఉంటుంది. అలానే అకిరా మీద కూడా తన బ్రదర్ హుడ్ ని చూపిస్తుంటాడు చరణ్. అన్ స్టాపబుల్ ఇంటర్వ్యూలో సెలబ్రిటీ హంగామా ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ఐతే చరణ్ ఎపిసోడ్ మాత్రం కచ్చితంగా స్పెషల్ కానుందని చెప్పొచ్చు.

చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ రెండు సినిమాలు సంక్రాంతి ఫైట్ కి వస్తున్నాయి. ఐతే రెండు సినిమాలు సక్సెస్ అవ్వాలి తెలుగు పరిశ్రమ ఇలానే అభివృద్ధి చెందాలని బాలయ్య కోరారు. చరణ్ గేమ్ ఛేంజర్ జనవరి 10న వస్తుండగా డాకు మహారాజ్ సినిమా 12న రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య మంచి ఫైట్ జరగనుంది.