Begin typing your search above and press return to search.

కల్కి, స్పిరిట్‌ సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌ వర్మ క్లారిటీ

ఇంకా స్పిరిట్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న కారణంగా స్పిరిట్ సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతుంది.

By:  Tupaki Desk   |   3 April 2025 12:47 PM
కల్కి, స్పిరిట్‌ సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌ వర్మ క్లారిటీ
X

ఇటీవల రామ్‌ గోపాల్‌ వర్మ, సందీప్ రెడ్డి వంగ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో సందీప్ రెడ్డి వంగ సినిమా మేకింగ్‌పై వర్మ ప్రశంసలు కురిపించాడు. అంతే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా కూడా సందీప్ సినిమాల గురించి, ఆయన ఫిల్మ్‌ మేకింగ్‌ గురించి ప్రముఖంగా వ్యాఖ్యలు చేశాడు. సందీప్ సినిమాలో నటించేందుకు రెడీ అన్నట్లుగా ఒక సందర్భంలో వర్మ చెప్పుకొచ్చాడు. అప్పటి ఉంచి సందీప్ వంగ తదుపరి సినిమా స్పిరిట్‌లో వర్మ నటించబోతున్నాడు అనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రభాస్ గత చిత్రం కల్కి 2898 ఏడీలో వర్మ గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు స్పిరిట్‌ సినిమాలోనూ సందీప్ వంగ కోసం వర్మ గెస్ట్‌గా మారబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

స్పిరిట్‌ సినిమాలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై వర్మ స్పందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రామ్‌ గోపాల్ వర్మ మాట్లాడుతూ... స్పిరిట్‌ సినిమాలో నేను నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. స్పిరిట్‌ సినిమాలో నటించమని సందీప్ ఇప్పటి వరకు నన్ను అడగలేదు. ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు నాకు తెలియదు. సందీప్‌ ఎప్పుడూ ఆ సినిమా గురించి నా వద్ద మాట్లాడలేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఇంకా స్పిరిట్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న కారణంగా స్పిరిట్ సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతుంది. ఒకవేళ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత ఏమైనా వర్మను సందీప్‌ సంప్రదిస్తాడేమో చూడాలి.

ఇక కల్కి 2898 ఏడీ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేయడంపై కూడా వర్మ స్పందించాడు. కల్కి సినిమా టీమ్‌లో నాకు తెలిసిన వారు చాలా మంది ఉన్నారు. వారి కోసం ఆ సినిమాలో సరదాగా గెస్ట్‌ రోల్‌లో నటించాను. ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించడం సరదాగా అనిపించింది. ప్రేక్షకులు నా నుంచి అలాంటి పాత్రను ఊహించి ఉండరు. సినిమాలో నన్ను అలా చూసి కచ్చితంగా సర్‌ప్రైజ్ అయ్యి ఉంటారు. కల్కి సినిమాలో నేను కనిపించింది కొద్ది సమయం అయినా ప్రేక్షకులు నా పాత్రను ఎంజాయ్ చేశారు, వారికి నా పాత్ర నచ్చిందని వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ గతంలో చాలా సినిమాల్లో గెస్ట్‌ రోల్‌లో నటించాడు. తన సినిమాల్లోనూ ఆయన గెస్ట్‌గా కనిపించిన సందర్భాలు ఉన్నాయి.

ఫిల్మ్‌ మేకింగ్‌ పై వర్మ ఈమధ్య సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. ఆయన ఆడుతూ పాడుతూ సినిమాలు చేస్తున్నాడు తప్ప సీరియస్‌గా సినిమాను తీస్తే తప్పకుండా మంచి ప్రాజెక్ట్‌లు వస్తాయని ఇప్పటికీ వర్మ పై నమ్మకంను వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు. ఆ మధ్య సందీప్ రెడ్డి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వర్మ గారు సీరియస్‌గా ఒక సినిమా తీస్తే చూడాలని ఉందని అన్నాడు. వర్మ సైతం ఆ సమయంలో స్పందిస్తూ ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తప్పకుండా వర్మ నుంచి ఒక మంచి సినిమా ముందు ముందు అయినా వస్తుందనే నమ్మకంను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.