Begin typing your search above and press return to search.

`తెలుగు ఇండియా` అంటూ వ‌ర్మ సంచ‌ల‌నం!

పాన్ ఇండియాలో `పుష్ప‌-2` సంచ‌ల‌నం కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మ్రోగిస్తుంది.

By:  Tupaki Desk   |   8 Dec 2024 4:30 PM GMT
`తెలుగు ఇండియా` అంటూ వ‌ర్మ సంచ‌ల‌నం!
X

పాన్ ఇండియాలో `పుష్ప‌-2` సంచ‌ల‌నం కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మ్రోగిస్తుంది. బాలీవుడ్ లో ఖాన్ లు..క‌పూర్ లు సైతం ఐకాన్ స్టార్ పంచ్ కి మెంట‌లెక్కిపోతుంది. లాంగ్ ర‌న్ లో చిత్రం 1500..2000 కోట్లు సాధిస్తుందంటూ అంచ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే సినిమాపై సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

`హిందీలో డ‌బ్బింగ్ చిత్రం స‌త్తా చాటింది. బాలీవుడ్ లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా `పుష్ప‌-2` హిస్ట‌రీ క్రియేట్ చేసింది. నాన్ హిందీ యాక్ట‌ర్ అల్లు అర్జున్ అక్క‌డ బిగ్గెస్ట్ స్టార్ గా నిలిచారు. అందుకే ఇది పాన్ ఇండియా కాదు తెలుగు ఇండియా సినిమా` అని రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. మొత్తంగా వ‌ర్మ పోస్ట్ తో భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో నెంబ‌ర్ ఇండ‌స్ట్రీ తెలుగు ప‌రిశ్ర‌మ ఖ్యాతికెక్కిన‌ట్లు మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.

పాన్ ఇండియాలో తెలుగు సినిమాల సంచ‌ల‌నాల‌తోనే హిందీ ప‌రిశ్ర‌మ‌ను తెలుగు ఇండస్ట్రీ ప‌క్క‌కు నెట్టింద‌నే ప్ర‌చారం మొద‌లైంది. `పుష్ప‌-2` బిగ్గెస్ట్ వ‌సూళ్ల‌తో ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ ఇండ‌స్ట్రీగా అవ‌త‌రించిన‌ట్లు అయింది. మూడు రోజుల్లోనే హిందీలో 205 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. రిలీజ్ రోజు 72 కోట్లు.. రెండో రోజు 59 కోట్లు, మూడో రోజు 74 కోట్లు వ‌సూళ్లు సాధించింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా తొలి రోజు 294 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది.

తొలి రోజు ఈ స్థాయిలో వ‌సూళ్లు ఇప్ప‌టి వర‌కూ ఏ భార‌తీయ చిత్రం రాబ‌ట్ట‌లేదు. వ‌ర‌ల్డ్ వైడ్ గా మూడు రోజుల్లోనే 621 కోట్లు రాబ‌ట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేష‌న్ కావ‌డంతోనే ఇది సాధ్య‌మైంద‌న్న‌ది అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది.