Begin typing your search above and press return to search.

ఆర్జీవి భారీ మల్టీస్టారర్ ప్లానింగ్..?

ఐతే తనని చూసి ఎంతోమంది స్పూర్తి పొంది డైరెక్టర్ గా మారగా ఆర్జీవి ఈ పరిస్థితిలో ఉండటం చూసి షాక్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   22 Jan 2025 9:30 AM GMT
ఆర్జీవి భారీ మల్టీస్టారర్ ప్లానింగ్..?
X

సంచలనం ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు ఆర్జీవి. ఆయన చేసే పనులు.. మాట్లాడే మాటలు.. పెట్టే ట్వీట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి. దర్శకుడిగా ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పూర్తిగా ట్రాక్ తప్పేశాడని ఫిక్స్ అయ్యారు. ఆర్జీవి సినిమా అంటే ఎలా ఉంటాయో రెండు దశాబ్దాల క్రితమే తనకంటూ ఒక సిగ్నేచర్ ఏర్పరచుకున్న ఆర్జీవి ఈమధ్య పూర్తిగా ట్రాక్ తప్పేశాడని అనిపిస్తుంది.

ఐతే తనని చూసి ఎంతోమంది స్పూర్తి పొంది డైరెక్టర్ గా మారగా ఆర్జీవి ఈ పరిస్థితిలో ఉండటం చూసి షాక్ అవుతున్నారు. మళ్లీ ఒకప్పటి ఆర్జీవి డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. రీసెంట్ గా యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో ఆర్జీవి ఆలోచనల్లో మార్పు మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ విషయాన్ని తెలియచేస్తున్న ఆజీవి త్వరలో తన కం బ్యాక్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.

ఆర్జీవి ఒక పాన్ ఇండియా సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో మూడు నాలుగు సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ సినిమా కూడా ఆయనతో చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తాడని చెప్పుకుంటున్నారు. అమితాబ్, వెంకటేష్ ఈ కాంబోలో ఆర్జీవి తన మార్క్ సినిమా తీస్తే మాత్రం మళ్లీ ఆయన తిరిగి ఫాంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.

ఆర్జీవి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడంటే మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు షురూ అయినట్టే లెక్క. మరి అమితాబ్, వెంకటేష్ తో ఆర్జీవి చేయబోతున్న సినిమా ఎలా ఉండబోతుంది. నిజంగానే ఈ కాంబో సినిమా వస్తుందా లాంటి వార్తలపై త్వరలో క్లారిటీ రాబోతుంది. ఆర్జీవి మాత్రం ఇక మీదట తన స్టాండర్డ్స్ కి తగినట్టు సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. నిజంగానే ఆర్జీవి మనసు పెట్టి సినిమా తీయడం మొదలు పెడితే మాత్రం ఇంకా చాలా గొప్ప కథలు ప్రయోగాలు నేషనల్ లెవెల్ లో రచ్చ చేయడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. వర్మ కంబ్యాక్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుంచో వెయిటింగ్ లో ఉన్నారు.