శ్రీదేవి అంటే ఇష్టం... జాన్వీతో ఇంట్రెస్ట్ లేదు!
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి అతిలోక సుందరి శ్రీదేవి అంటే ఎంతటి అభిమానమో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 4 Jan 2025 4:29 AM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి అతిలోక సుందరి శ్రీదేవి అంటే ఎంతటి అభిమానమో అందరికీ తెలిసిందే. శ్రీదేవిని డైరెక్ట్ చేయడానికే, ఆమెపై ఉన్న అభిమానంతోనే తాను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాను అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. శ్రీదేవి కంటే తనకు ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ ఇష్టం లేరని వర్మ గతంలో పేర్కొన్నారు. శ్రీదేవి హీరోయిన్ గా రాంగోపాల్ వర్మ పలు సినిమాలను రూపొందించిన విషయం తెలిసిందే. శ్రీదేవి చనిపోయిన సందర్భంలో రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్ట్ లు అందరి దృష్టిని ఆకర్షించాయి. శ్రీదేవి తర్వాత ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.
బాలీవుడ్‌లో గత నాలుగైదు సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ కి పెద్దగా సక్సెస్ రాలేదు. కానీ తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి నటించిన దేవర సినిమా ఆమెకు కమర్షియల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తెచ్చి పెట్టింది. మరో వైపు రాంచరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సైతం జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే మరో వైపు టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు జాన్వి కపూర్ ఓకే చెబుతోంది. తాజాగా రాంగోపాల్ వర్మ ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం కానీ ఆమె కూతురు జాన్వీ కపూర్‌తో సినిమా చేయాలని అనుకోవడం లేదు అన్నారు.
జాన్వీ కపూర్ లో ఎప్పుడు తాను శ్రీదేవిని చూడలేకపోతున్నాను అన్నారు. జాన్వీ కపూర్ వేరు శ్రీదేవి వేరు అన్నట్లుగా రాంగోపాల్ వర్మ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీదేవి స్థాయికి జాన్వీ కపూర్ వెళ్తుందా అనే విషయంపై ఆయన స్పందిస్తూ శ్రీదేవి స్థాయికి మరి హీరోయిన్ వెళ్లరు అన్నట్లుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జాన్వీ కపూర్ తో సినిమా చేసే ఆలోచన లేదని రాంగోపాల్ వర్మ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. చాలా కాలం తర్వాత వర్మ దృష్టి పెట్టి తన పాత సినిమాల మాదిరిగా మంచి కంటెంట్ ఓరియంట్ సినిమాను రూపొందిస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది.
వింటేజ్ వర్మ ని చూస్తారంటూ ఆయన సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్య తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అసభ్యకరంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు గాను కేసులు నమోదయ్యాయి. పోలీసులు అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి కూడా వెళ్లారు. కానీ ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల అరెస్టు చేయలేక పోయారు. భవిష్యత్తులో అయినా ఆయన అరెస్టు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. వర్మ మాత్రమే తాను ఏ తప్పు చేయలేదని అరెస్టు అయ్యే అవకాశం లేదని చాలా బలంగా చెబుతున్నారు.