Begin typing your search above and press return to search.

స్త్రీ లేకుండా నేను బతకలేను : వర్మ

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సమాజంతో పని లేకుండా బతికేస్తూ ఉంటాడు. ఇలా కొద్ది మంది మాత్రమే ఉంటారు.

By:  Tupaki Desk   |   8 March 2025 4:38 PM IST
స్త్రీ లేకుండా నేను బతకలేను : వర్మ
X

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సమాజంతో పని లేకుండా బతికేస్తూ ఉంటాడు. ఇలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. సెలబ్రెటీలు ఒక ట్వీట్‌ చేయాలి అంటే వంద సార్లు ఆలోచించాలి. ఏదైనా వివాదం వస్తుందా... ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తీంటాయా అంటూ చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎంతగా ఆలోచించినా కొందరు సెలబ్రెటీలు చేసిన ట్వీట్స్‌ తో వివాదం రాజుకోవడం, ఆ సెలబ్రెటీలు క్షమాపణలు చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ వర్మ ఇందకు పూర్తి భిన్నం అనడంలో సందేహం లేదు. ఆయన ఏమైనా ట్వీట్‌ చేయగలడు. ఆయన ఏ ట్వీట్‌ చేసినా జనాలు ఎంటర్‌టైన్‌ అవుతారే తప్ప ఆయన్ను విమర్శించేందుకు సాహసించరు.

ఆ మధ్య వరుస కేసుల వల్ల వర్మ అరెస్ట్‌ కాక తప్పక పోవచ్చు అని అంతా భావించారు. అంతే కాకుండా వర్మను ఏపీ ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. మరికొన్ని కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ వర్మ ఇప్పటి వరకు అరెస్ట్‌ కాలేదు. ఆయన అరెస్ట్‌ అయ్యే అవకాశాలు కూడా లేవని వర్మను సోషల్‌ మీడియా ద్వారా ఫాలో అయ్యే వారు అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా మరోసారి వర్మ విచిత్రమైన పోస్ట్‌ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. వివాదాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న వర్మ ఉమెన్స్ డే ను సైతం వదలకుండా తనదైన శైలిలో స్పందించాడు.

ఉమెన్స్ డే సందర్భంగా రామ్ గోపాల్‌ వర్మ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌లో... నా ఉనికి అనేది లేకుండా నేను బతుకుతాను, కానీ ఆడవారి ఉనికి లేకుండా నేను బతకలేను... హ్యాపీ ఉమెన్స్‌ డే అంటూ ట్వీట్‌ చేశాడు. ఇంత బాహాటంగా ఒక విషయం గురించి మాట్లాడటం, ట్వీట్‌ చేయడం కేవలం వర్మకు మాత్రమే చెల్లిందని, ఆయన కాకుండా ఇలా మరెవ్వరు మాట్లాడలేరు, ఆయన మాదిరిగా మరెవ్వరు ట్వీట్‌ చేయలేరు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే వర్మపై ఎంతో మంది ఆడవాళ్లు విమర్శలు చేస్తారు. ఆడవారు అంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తాడు అంటూ విమర్శలు చేసే వారు చాలా మంది ఉన్నారు.

రామ్‌ గోపాల్‌ వర్మ శారీ అనే సినిమాను నిర్మించాడు. ఆర్జీవీ డెన్‌ బ్యానర్‌ లో వర్మ నిర్మించిన శారీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శారీ సినిమా ప్రమోషన్‌లో వర్మ పాల్గొంటున్నాడు. సోషల్‌ మీడియాలో ఒక లేడీ చీర కట్టులో కనిపించి ఆకట్టుకుంది. దాంతో వర్మ వెంటనే ఆమెను హీరోయిన్‌గా శారీ అనే సినిమాను తీశాడు. ఈ సినిమాను ఆయన నిర్మించగా దర్శకత్వం మాత్రం మరో దర్శకుడు వహించాడు. వర్మ డెన్‌ నుంచి రాబోతున్న సినిమా కావడంతో జనాల్లో పెద్దగా పట్టింపు లేదు. కానీ ఒక వర్గం ప్రేక్షకుల మాత్రం థియేటర్‌లో శారీని చూడటం కోసం వెయిట్‌ చేస్తున్నారు.